యేసుతో ముఖాముఖి预览

కనాను దేశానికి చెందిన ఒక అన్యజాతి స్త్రీ,యూదు జాతి దానిని గ్రహించడం ప్రారంభించే చాల ముందు కృప యొక్క ఆలోచనను అర్థం చేసుకుంది. యేసు ఆమెను అవమానించుటకు మాట్లాడలేదు,అది కఠినంగా మరియు శ్రద్ధలేనిదిగా కనిపించినప్పటికీ,బదులుగా,ఆయన ఆమె తన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆమెను ప్రేరేపించాడు. ఈ ఉచ్చారణలో,పిల్లల కోసం ఉద్దేశించిన ఆహారము కుక్కలకు విసిరివేయడం వంటి ఆహారము యొక్క ఊహా చిత్రామును యేసు ఉపయోగించినప్పుడు,దానికి ఆమె యజమానుని బల్ల నుండి పడిపోయిన ముక్కలను కుక్కలు తింటాయి అని చెప్పింది. ఆమె యేసును తన యజమానిగా కలిగి ఉందని మరియు ఆమె తనకు అర్హత లేదు అని తెలిసినప్పటికీ ఆయన ఆమెకు ఏదైనా అందిస్తున్నాడని ఈ అవగాహన,ఆమె తరపున యేసును చర్య తీసుకునేలా చేసింది.
మనం దేని కోసమైనా దేవుని ఎందుకు అడుగుచున్నామో మనకు తెలియదు లేదా మనము తప్పుడు ఉద్దేశాలతో ఆయనను అడిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ రకమైన మౌఖికీకరణలో మనం దేని కోసం విశ్వసిస్తున్నామో మరియు దేవుని యొక్క శక్తి,ఉనికి మరియు ప్రణాళికల గురించి ఏవైనా సందేహాలు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రేమ,క్షమాపణ మరియు స్వస్థత మీద మనం ఎంత ఆధారపడి ఉన్నామో ఇంకా అర్హత లేనివాళ్ళమో కూడా మనం గ్రహించాము.
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
దానిని సిద్దబాటులో ఎవరితోనైనా పంచుకోవడానికి నా విశ్వాసాన్ని నేను ఎలా బాగా వ్యక్తీకరించగలను?
యేసు నా యజమానా?నేను ఆయనకు సేవ చేస్తానా లేక ఆయన నాకు సేవ చేయవలెనా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More