Skip to content
Biểu tượng Ứng dụng Kinh Thánh

రోమీ 2

2
దెయ్యమ్నె న్యాయ్
1అదుంఙ్ ఎత్తి మరొక్కొరెత్ న్యాయ్ కలెకని ఏనివేకద్, ఇనేత్‍ నీవి మాప్ ఇడ్డెంఙ్. ఎదున్‍ బదోల్‍ ఎక్కద్ మరొక్కొనుంఙ్ న్యాయ్ ఇదర్‍సాతివొ అదున్ బదోల్ నీవి దొస్ ఇసా న్యాయ్ కల్సతీ. తానుంఙ్ ఇంతె నీ ఎపనిక్‍ బదోల్ న్యాయ్ కల్సతివొ అదుని నీ నాయ్ కల్సతీ తా? 2ఆపనిక్ కలెకర్‍పొయ్ దెయ్యమ్నె సత్తెం న్యాయ్‍కలెకది ఇసా నేండుంఙ్ ఒర్కియ్. 3ఆపనిక్‍ కలెకరుంఙ్ న్యాయ్ కల్‍సా అదవులునీ కలెకా ఒక్కొ మన్కక్, దెయ్యమ్నె న్యాయ్ వెలంఙ్ సుకడిపతీ?
4దెయ్యమ్నె సిలువ అల్కే ఇన్ పస్సత్తప్ పడెంఙ్ కర్యకత్న ఒర్కితోసెట అమ్నె దయ ఇనెకా అనే మన్ బద్లిపుర్ కలెకదున్ ఎపుడి అనెక సత్తిన్ డగ్లిపుత్ పుసాతివా? 5ఇన్నె మొండితనమున్, బదలిల్సెట ఇన్నె మనున్ బదోల్ దెయ్యమ్నె న్యాయ్‍ తా న్యాయ్ ఎరెకా ఆ ఉగ్రత దినముంఙ్ సటీ, దెయ్యమ్నె రగ్గున్ దండి కల్సతీ. 6అంద ప్రతి మన్కన్ అమ్నె పనిన్ ఓలుత్ కుల్కడ్ సియ్‍సాద్. 7సోయ్ తా పనిక్ కుసినడ్ కల్సా, మహిమ గనత, నాస్ ఎరెకదున్ కిరవేకరున్ ఎప్పుడి అనెకా పానం సియ్‍సాద్. 8అనంఙ్ ఎరత్తె సొయ్తర్, నమ్మెకారున్ సాయుత్న అన్యాయ్ కలెకర్‍ పొయ్ దెయ్యమ్నె రగ్, గుల్‍ రగ్ వర్సాద్.
9కరబ్ పని కలెక ప్రతి ఒక్కొ మన్కకెర్ ఆత్మ, పేలె యూదులుంఙ్, మరొక్కొరుంఙ్ నాయ్ పేలెయ్ గ్రీకులూంఙ్ దుక్లగ్సాద్. 10అనంఙ్ ఎరతె సోయ్ పని కలెకా ప్రతి ఒక్కొనుంఙ్‍, పేలె యూదులుంఙ్, వెన్కత్ గ్రీకు దేస్ తరుంఙ్ మహిమ, సాంతి సమాదాన్ ఎరద్. 11తానుంఙ్ ఇంతె దెయ్యముంఙ్ బేత్ బావ్ తోతెద్. 12నియం సాస్త్ర అత్న పాప్ కత్తర్ నియం సాస్త్రం లంఙ్‍ న్యాయ్ ఎరద్. నియం సాస్త్ర తోసెట పాప్ కత్తర్‍నై నియం సాస్త్ర తోసెటర్ నాస్‍ ఎర్‍సార్. 13నియం సాస్త్ర వినెకరున్ తోద్, అదున్ సుముత్ అడ్‍గెకరునీ దెయ్యం నీతి నాడ్ అనెకర్ ఇసా ఆసాద్.
14నియం సాస్త్ర తోసెటా యూదులెర్సెటర్ సబవున్ నియం సాస్త్ర ఇడ్‍తెతి అడ్‍గెతె ఔరుంఙ్ నియం సాస్త్ర తోసెటండెనా తమ్మెత్‍ తామ్మి నియం సాస్త్రం లంఙ్ అంసార్. 15ఆంటరె మన్ సాక్సినాయ్ సాక్స సియ్‍సాద్. ఔరెవిచార్ ఔరుంఙ్ పొయ్ గలత్‍ ఎరెకడి గలత్ తోతెంద్ ఇసా ఇడేకాది ఇదర్‍సాద్. అటరె మడ్ల లోప నియం సాస్త్ర వయ్‍తెతియ్ అన్సాద్. 16అన్నె సువార్త లంఙి దెయ్యం యేసు క్రీస్తున్ వాలడ్ మన్కకెరె బత్కకదున్ విచార్ కలెకా దినా ఇనంఙ్ ఎద్దా.
యూదులె నియం సాస్త్ర
17ఇండి నీ యూదుని ఇసా పేర్‍ ఇడుత్న నియం సాస్త్రం పొయ్‍ బరొస ఇడుత్ దెయ్యమున్ బదోల్‍ అసా కల్సతివ తొదా? 18అమ్నె ఇచ్చ కరిలుతి, నియం సాస్త్రముత్ గొట్టి విత్న ఎద్‍ సొబతదో సియ్‍తెంద్ కరిలుతి అదున్ మెచ్చతి తా? 19గ్యాన్ సత్తెం త నియం సాస్త్రముత్ కలయుత్ అత్తన, “అన్ గుడ్డికున్ పావొలిపెకారన్, చికటిత్ అనెకరున్ వెలుంఙ్ ఓలిపెకరాన్. 20నియం‍ సాస్త్రమున్ బుద్ది తోసెటరున్ సోయ్‍ కలేకారన్, సిన్న పోరకేరున్ మాస్ తార్ లాంఙ్” సత్తెం అన్సాతి తా? 21మరొక్కొరుంఙ్ ఉపదేస్ ఇడ్డెకారన్, ఇనుంఙ్ నీవి ఇడెవా? డొంఙా కన్నెమ్ ఇసా ఇడ్డెకనివి డొంఙా కల్సాతీవా? 22చినలి కన్నెమ్‍ ఇసా ఇడ్డెకనివి సినాలి కల్‍సాతివా? ముర్తికున్ ఆసహ్యించుకుంటూ నీవి గుడికున్ డొంఙా కల్సాతివా?
23నియం సాస్త్రత సోయ్త ఇడ్డెకనివి నియం సాస్త్ర మీరి, దెయ్యమున్ అపమన్‍ కల్‍సాతివా? 24ఇమ్‍వాలడి తా దెయ్యమ్నె పేర్ యూదు లెర్సెటరున్ నాడుమున్ బద్నం కల్సాద్? ఇసా వాయుత్ అంసాత. 25నీవ్ నియం సాస్త్రన్ పడిపెకనివ్‍ ఎరత్తె ఇనుంఙ్ సున్నతి ఉపయెగం వర్‍సాద్ గానీ నియం సాస్త్రాన్ని పడిపెవ్‍ ఎరత్తె, నీ సున్నతి ఎర్‍సెటద్‍లంఙ్. 26అదుంఙ్ ఎత్తి సున్నతి తోసెటద్లంగి నియం సాస్త్ర నియములున్ పడిప్తే సున్నతి తోసెటండెనా సున్నతి సుమ్తెత్తి ఎర్‍సాద్‍ తా? 27సున్నతి సుమ్సెటండెనా నియం సాస్త్రన్ సుముత్‍ బత్కెకర్, వాయుత్ వసం‍లెంఙ్, సున్నతి సుముత్ నియం సాస్త్రమున్ పాడిప్సెటనీ ఇనుంఙ్ న్యకల్సాద్‍ తా? 28పొయ్ యూదు లంఙ్ కన్కెనెద్ యూదుంద్ ఎరెంద్‍, సరీరుత్ పొయ్ కన్కెరెకా సున్నతి ఎరెద్. 29లోపా యూదులెదది యూదు. సున్నతి మన్నుత్ సెదిన్. అద్ ఆత్మత్ జర్గిలెకాది గని అనంఙ్ ఎరెద్. అటనున్ మన్కకెర్ ఎరెర్, దెయ్యమి మెస్సెంద్.