సంఖ్యా 1
1
జనాభా లెక్కలు
1ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల#1:1 ప్రాచీన హెబ్రీయులు చంద్రునికి సంబంధించిన క్యాలెండర్ ఉపయోగించేవారు. దాని ప్రకారం రెండవ నెల అంటే ఏప్రిల్ లేదా మే మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు: 2మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి. 3నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి. 4ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.
5“మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి:
“రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;
6షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;
7యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;
8ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;
9జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు;
10యోసేపు కుమారుల నుండి:
ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా;
మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;
11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;
12దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు;
13ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;
14గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;
15నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”
16వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.
17యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని, 18రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు. 19యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు:
20ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 21రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.
22షిమ్యోను సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 23షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300.
24గాదు సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 25గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.
26యూదా సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 27యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.
28ఇశ్శాఖారు సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 29ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400.
30జెబూలూను సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 31జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400.
32యోసేపు కుమారులు:
ఎఫ్రాయిం సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 33ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500.
34మనష్షే సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 35మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.
36బెన్యామీను సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 37బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.
38దాను సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 39దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.
40ఆషేరు సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 41ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.
42నఫ్తాలి సంతతివారి నుండి:
యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. 43నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.
44వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు. 45ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 46వీరి మొత్తం సంఖ్య 6,03,550.
47అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు. 48యెహోవా మోషేతో ఇలా అన్నారు: 49“లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. 50దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి. 51సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి. 52ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి. 53అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”
54యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు.
ที่ได้เลือกล่าสุด:
సంఖ్యా 1: TSA
เน้นข้อความ
คัดลอก
เปรียบเทียบ
แบ่งปัน
ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.