โลโก้แอพพระคัมภีร์
ไอคอนค้นหา

ద్వితీయో 25

25
1ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు. 2ఒకవేళ దోషులు శిక్షార్హులైతే న్యాయాధిపతి వారిని పడుకోబెట్టి అతని సమక్షంలో నేరానికి తగ్గట్టుగా కొరడా దెబ్బల సంఖ్యతో కొరడాతో కొట్టాలి, 3కానీ న్యాయాధిపతి నలభైకి మించి కొరడా దెబ్బలు వేయకూడదు. దోషిని అంతకు మించి కొరడాలతో కొడితే మీ తోటి ఇశ్రాయేలీయుడు మీ దృష్టిలో దిగజారిపోతాడు.
4ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు.
5అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కుటుంబంగా వుంటున్నప్పుడు వారిలో ఒకడు సంతానం లేకుండా చనిపోతే అతని భార్య పరాయివాడ్ని చేసుకోకూడదు, గతించిన తన భర్త తోబుట్టువు ఆమెను పెళ్ళి చేసుకోవాలి, ఆమె పట్ల బావమరిది విధిని నెరవేర్చాలి. 6ఆమె కనిన మొదటి కుమారుడు చనిపోయిన సోదరుడి పేరును కొనసాగించాలి, తద్వారా అతని పేరు ఇశ్రాయేలు నుండి తొలగించబడదు.
7ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి. 8అప్పుడు పట్టణ పెద్దలు అతన్ని పిలిపించి మాట్లాడాలి. అప్పటికీ అతడు, “ఆమెను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని మొండిగా ఉంటే, 9అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి. 10అప్పుడు వాని వంశం ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన కుటుంబం అని పిలువబడుతుంది.
11ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటునప్పుడు వారిలో ఒకని భార్య అవతలివాని బారి నుండి తన భర్తను విడిపించడానికి వచ్చి వాని మర్మాంగాన్ని పట్టుకున్నట్లయితే, 12ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.
13మీ సంచిలో రెండు వేరువేరు తూనిక రాళ్లు ఒకటి బరువైనవి ఇంకొకటి తేలికైనవి ఉండకూడదు. 14మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు. 15మీ ఖచ్చితమైన, న్యాయమైన తూనిక రాళ్లు న్యాయమైన త్రాసులు ఉండాలి, తద్వారా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమిలో మీరు ఎక్కువకాలం జీవిస్తారు. 16అన్యాయపు తూకం వేసేవారిని, అన్యాయం చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
17ఈజిప్టు నుండి మీరు వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమాలేకీయులు మీకు చేసింది జ్ఞాపకముంచుకోండి. 18మీరు అలసిపోయి బడలికతో ఉన్నప్పుడు, వారు మీ ప్రయాణంలో మిమ్మల్ని కలుసుకున్నారు వెనుకబడిన వారందరిపై దాడి చేశారు; వారికి దేవుని భయం లేదు. 19మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్న శత్రువులను పారద్రోలి మీకు విశ్రాంతి ప్రసాదించిన తర్వాత ఆకాశం క్రింద అమాలేకీయులను నామరూపాలు లేకుండా తుడిచివేయాలని మరచిపోవద్దు.

ที่ได้เลือกล่าสุด:

ద్వితీయో 25: TSA

เน้นข้อความ

คัดลอก

เปรียบเทียบ

แบ่งปัน

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้