యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు, అన్ని నామములకు పైన నామము

7 యొక్క 3

అబ్రాహాము కుమారుడు

"అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి." (మత్తయి 1:1 TELUBSI)

యేసు తన ఇహలోక పుట్టుక ద్వారా కొంతమంది ముఖ్యమైన మరియు శక్తివంతమైన యూదు విశ్వాసుల వంశస్థుడు: రాజైన దావీదు మరియు ఇశ్రాయేలు స్థాపకుడైన అబ్రహము . దీని నుండే ఇశ్రాయేలు జాతి పుట్టింది.

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా (ఆదికాండము 12:1-3)

మత్తయి కాలంలోని యూదులకు రాబోయే రక్షకుని గురించి దేవుని వాగ్దానాల గురించి ముందుగానే తెలుసు,మరియు వారు వాటి నెరవేర్పు కోసం ఎదురు చూశారు. యూదు ల బాలుడిగా మత్తయి కూడా దేవుని మాటలతో పెరిగాడు.యేసు జననంతో, ఇశ్రాయేలుకు కొత్త సమయం మొదలైంది . యేసుక్రీస్తు ద్వారా, మత్తయి సొంత జీవితం కూడా కొత్త గా ఆరంభమైంది . (మత్తయి 9:9)

ఈ నూతన జీవితం ప్రారంభం నుండే, దేవుడు స్పష్టం చేశాడు: ఈ కుమారుడు "సాధారణ మానవుల " కంటే ఎక్కువ. అని
నేను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి ఆయన వస్తాడు.అని కాబట్టి, మత్తయి తన వంశావళిలో ఈ కుమారుని కోసం ప్రత్యేక పదాలను ఉపయోగించాడు.
యోసేపును “యేసు తండ్రి” అని పిలవడానికి బదులుగా, మత్తయి ఇలా వ్రాశాడు:క్రీస్తు అని పిలవబడే “యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను." (మత్తయి 1: 16 TELUBSI)

ఈ ప్రణాళిక గురించి

యేసు, అన్ని నామములకు పైన నామము

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org