యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు, అన్ని నామములకు పైన నామము

7 యొక్క 5

ఇమ్మానుయేలు దేవుడు

"అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము." (మత్తయి 1:23 TELUBSI)

మరియాకు ప్రధానం చేయాడిన యోసేపు మొదట తనకు కాబోయే భార్య తన ప్రమేయం లేకుండానే గర్భవతి అయిందని నమ్మలేకపోయాడు . (మత్తయి 1:18-25)కానీ అతని కలలో దేవుని దూత తనకు మరియ చెప్పింది నిజమని ధృవీకరించాడు.
తాను మరియ పెంచబోయే కుమారుడికి యేసు అని పేరు పెట్టమని యోసేపుకు సూచించబడింది (మత్తయి 1:21).
యూదుల బాలుడిగా తాను పొందిన విద్య ద్వారా, యోసేపు తన ప్రజల చరిత్ర బాగా ఎరిగిన వాడూ .
మరియ మోస్తున్న బిడ్డ నిజంగా దేవుడిచ్చినదేనని దేవదూత ధృవీకరించిన మాటలు కూడా అతనికి బాగా తెలిసే ఉండాలి.

"కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును." (యెషయా 7:14 TELUBSI) అనే ప్రవక్త యెషయా రచనల ద్వారా దేవదూత వెల్లడించాడు. ఇమ్మానుయేలు అంటే "దేవుడు మనకు తోడు ".దేవుడు తన గొప్పతనం మరియు మహిమతో దూరంలో ఉండే దేవుడు కాదు. యేసులో, దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నట్లు చూపించాడు ఇప్పటికీ చూపిస్తున్నాడు.యేసు ద్వారా మనలను రక్షించడానికి మనకు అంత దగ్గరగా వచ్చాడు మరియు తన ఆత్మ ద్వారా మనలో జీవించాలని ఆశిస్తున్నాడు
యోసేపు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో మీరు ఊహించగలరా? భూమిపై యేసు జీవితంలో దేవుడు యోసేపును చేర్చుకున్నందుకు .

యేసు ఇమ్మానుయేలు మీరు నాకు చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నందుకు మరియు మీరు నా జీవితంలో ప్రారంభించిన మంచి పనిని ఎప్పటికీ విడువనందుకు ధన్యవాదాలు.

ఈ ప్రణాళిక గురించి

యేసు, అన్ని నామములకు పైన నామము

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org