యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు, అన్ని నామములకు పైన నామము

7 యొక్క 2

దావీదు కుమారుడు

"అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి." (మత్తయి 1:1 TELUBSI)

బైబిల్లో మనకు అనేక వంశావళిలు కనిపిస్తాయి. వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం . ఈ వంశావళి ద్వారా ఎవరో ఒకరు ఇశ్రాయేలులో భాగస్థులని , దేవుడు ఎన్నుకున్న ప్రజలు అని చూపించవచ్చు. వీరి నుండే లోక రక్షకుడు పుడతాడు అని . ఇశ్రాయేలు ప్రజలను, అలాగే ఆయనను విశ్వసించిన ఇతర దేశాల ప్రజలను పాపం మరియు మరణం యొక్క శక్తి నుండి విమోచించేవాడు.అని

ఇది ఒక సాధారణ అద్భుతం కాదు : మానవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి దేవుడే స్వయంగా మానవుడిగా మారాలని కోరుకున్నాడు, . మత్తయి యేసు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. ఆయన ముఖ్యంగా యూదులను ఉద్దేశించి ఒక సువార్తను రాశాడు. ఈ సువార్త యేసు వంశావళితో ప్రారంభమవుతుంది. దీని ద్వారా, మత్తయి తన యూదులకు యేసు ఇశ్రాయేలు యొక్క అతి ముఖ్యమైన రాజు అయిన దావీదు వంశస్థుడని చూపించాడు. మరియ మరియు యోసేపు ఇద్దరూ వివిధ మార్గాల ద్వారా దావీదు వంశస్థులు. అందువలన, అతని ఇహలోక జననం ప్రకారం, యేసు దావీదు రాజు కుమారుడు. (లూకా 1:31-33) దేవుడు దావీదుకు ఎల్లకాలం రాజుగా ఉండే వంశస్థుడిని వాగ్దానం చేశాడు. (2 సమూయేలు 7:16; 1 దినవృత్తాంతములు 22:10) వంశావళిలో, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని మత్తయి చూపిస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడని బైబిల్లో చదవడం మీకు ఎలా ప్రోత్సహిస్తుంది?

యేసు, పరలోకం మరియు భూమికి రాజు వు , నీవు ఏమైయున్నావో నీకు వందనాలు . నీవు నా రాజు వి అని మరియు నేను నా జీవితాన్ని నీ బలం మరియు శక్తికి అప్పగించగలనని నమ్ముతున్నాను ధన్యవాదాలు

ఈ ప్రణాళిక గురించి

యేసు, అన్ని నామములకు పైన నామము

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org