రోమ 1:20
రోమ 1:20 KFC
మాపు దేవుణుదిఙ్ నెస్‌ఏప్ ఇజి ఎయెన్‌బా వెహ్తెఙ్ వీలు సిల్లెద్. ఎందానిఙ్ ఇహిఙ, దేవుణు ఎలాగ మర్తికాన్ ఇజి మాటు సుడ్ఃదెఙ్ సిల్లె, గాని వాండ్రు లోకం తయార్ కిత్తిబాణిఙ్ అసి లోకమ్‌దు తయార్ కిత్తి వనకబాణిఙ్ వాండ్రు ఎలాగ మర్తికాన్ ఇజి ఎలాకాలం మన్ని వన్ని పెరిసత్తు ఎలాగమర్తిక ఇజి మాటు సుడ్ఃజినాట్. అందెఙె దేవుణుదిఙ్ నెస్‌ఏన్ ఇజి ఎయెన్‌బా వెహ్తెఙ్ వీలు సిల్లెద్.







