2కొరింతి 12:6-7
2కొరింతి 12:6-7 KFC
నాను పొగ్‌డిఃదెఙ్ ఇజి ఒడ్ఃబిత్తిఙ, నిజం మనికెఙ్‌నె వెహ్న. అందెఙె నాను బుద్ది సిల్లికాన్ ఆఏ. ఎందనిఙ్ ఇహిఙ నాను కిత్తికెఙ్ సుడ్ఃజినొ, నాను వర్గినికెఙ్ వెంజినొ, నాను మన్ని దనిఙ్ ఇంక ఒద్దె పెరికాన్ ఇజి నా వందిఙ్ ఎయెన్‌బా ఒడ్ఃబిఏండ మండ్రెఙ్ ఇజి నాను పొగ్‌డిఃఏ. దేవుణుది డాఃఙితి మన్ని గొప్ప పెరి సఙతిఙ్ నఙి తోరె ఆతి వందిఙ్, నఙి నానె పెరిక ఇజి ఉబె ఆఏండ మండ్రెఙ్ ఇజి నఙి బాద కిదెఙ్ ఇజి నా ఒడొఃల్‌దు ఉండ్రి సాంపు ఇడ్డెః ఆతి లెకెండ్ ఒరెన్ సయ్తాను దూత నా డగ్రు పోకె ఆత మనాన్.





