YouVersion Logo
Search Icon

యోనా 4

4
దేవుని కరుణ మీద యోనా కోపం
1కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. 2కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు. 3కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”
4అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు. 5అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.
6యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు. 7మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
8ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు. 9అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
10అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.

Currently Selected:

యోనా 4: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in