YouVersion Logo
Search Icon

ప్రకటన 8

8
1ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను. 2అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
3మరియు సువర్ణధూపార్తి చేతపట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై#8:3 మూలభాషలో–ఇచ్చుటకై. అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్య బడెను. 4అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5ఆ దూత ధూపార్తిని తీసికొని, బలిపీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
6అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
7మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయ బడెను; అందువలన భూమిలో మూడవభాగము కాలి పోయెను, చెట్లలో మూడవభాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
8రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండు చున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవభాగము రక్తమాయెను. 9సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవభాగము చచ్చెను, ఓడలలో మూడవభాగము నాశన మాయెను.
10మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండు చున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవభాగముమీదను నీటిబుగ్గలమీదను పడెను. 11ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.
12నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవభాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవభాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవభాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవభాగము కొట్టబడెను.
13మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు–బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy