లూకా 1:26, 27, 28, 29-30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54-55, 56
లూకా 1:27 TELUBSI
దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.
లూకా 1:28 TELUBSI
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
లూకా 1:29-30 TELUBSI
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
లూకా 1:32 TELUBSI
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
లూకా 1:33 TELUBSI
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
లూకా 1:35 TELUBSI
దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
లూకా 1:36 TELUBSI
మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము
లూకా 1:38 TELUBSI
అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
లూకా 1:41 TELUBSI
ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
లూకా 1:49 TELUBSI
సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము.
లూకా 1:51 TELUBSI
ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెనువారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.
లూకా 1:54-55 TELUBSI
అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.