జా అన్నిమ్ కయ్లి పడ్తొ, ద్రాచ రస్సుమ్చి గలస్ దెర ప్రార్దన కెర, “ఈంజ గలస్చి రస్సుమ్ కిచ్చొ గుర్తుచి రిసొ మెలె, అంక నంపజతసచి పాపుమ్ పుంచితి అంచి లొఁయిచి గుర్తు ఈంజ. ఈంజ, అంచి నొవి ప్రమానుమ్ జర్గు జతిస్చి గుర్తు. ఈంజ కెర అంక ఉచార కెర కెఁయఁక పిలెకి, అంచి రిసొయి ఉచర్తె తా” మెన సంగ పియడ్లన్. కిచ్చొక మెలె, జా పోడియొ కెఁయఁక కయ్లె, జా ద్రాచ రస్సుమ్ కెఁయఁక పిలె, ప్రబు మొర అర్పితుమ్ జలిస్చి గుర్తు దెకయ్తసు, సాడుప కెర్లి రితి జతసు. జో ఈంజ లోకుమ్తె అన్నె జెతె ఎదక జయ్యి గుర్తు దెకయ్తె తా.