1
మీకా 4:5
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి ఎప్పటికీ నడుచుకుంటాము.
Compare
Explore మీకా 4:5
2
మీకా 4:2
అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, “యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.
Explore మీకా 4:2
3
మీకా 4:1
తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Explore మీకా 4:1
4
మీకా 4:3
ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.
Explore మీకా 4:3
Home
Bible
Plans
Videos