యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第37天

యేసు అత్యంత ప్రత్యేకమైన సంభాషణా శైలిని కలిగి ఉన్నాడు,అక్కడ ఆయన ఒకరిని అత్యంత అనుకూలమైన సమయంలో పట్టుకున్నాడు మరియు ఆమెతో సంభాషణను వెంటనే లోతుగా కొనసాగించాడు. ఆయన ముఖ్యమైన అంశాన్ని తప్పించి చిలిపి మాటలతో లేదా ముఖస్తుతి పదాలతో మాట్లాడడు. ఖచ్చితమైన దానిని సూటిగా మాట్లాడుతాడు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దానికి భిన్నంగా ఏమీ మాట్లాడ లేదు. ఆయన తన గురించి ఉన్నతమైన ప్రకటనలు చేసాడు.“నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును.” సమరయ స్త్రీ 5 సార్లు వివాహం చేసుకుంది మరియు ప్రస్తుతం ఒక వ్యక్తితో నివసిస్తున్న పరిస్థితిలో ఉంది. ఆమె స్పష్టంగా ఏదో లోతైన దాహంతో ఉంది,అయితేశారీరక సంబంధాలతో ఆమె ఆకలిని తాత్కాలికంగా తీర్చుకుంటుంది. యేసు మాత్రమే ఆమె లోతైన అవసరాలను తీర్చగలడనే వాస్తవాన్ని ప్రస్తావించడం ద్వారా అంశం యొక్క కేంద్రం వద్దకు నేరుగా వెళ్ళాడు.

మేము ఆ స్త్రీ కంటే భిన్నంగా లేము. మనం తరచుగా మన లోతైన అవసరాలను తాత్కాలిక పరిష్కారాలతో సంతృప్తి పరుస్తుంటాము. వాస్తవానికి ఆ అవసరాలను నింపడానికి మనకు యేసు అవసరం. తద్వారా సంపద,విజయం,ప్రాముఖ్యత మొదలైన ఈ యుగపు తప్పుడు దేవుళ్లను మనం ఆరాధించడం నిలిపివేస్తాము. మనం దేవుణ్ణి ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలి, మనలను మనం సంపూర్తిగా ఖాళీ చేసుకోన్నప్పుడు ఆయన మనలను నింపుతాడు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నా జీవితం ఎక్కడ ఖాళీగా అనిపిస్తుంది?
నా ఆరాధన దేవునికి లేదా వస్తువులకు/ వ్యక్తులకు ఉద్దేశించబడిందా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More