ప్రత్యేకంగా ఉండండినమూనా

సిలువ యొక్క శక్తి
1:10-31: మనము 1:10-17 చదివితే, అపొస్తలుడైన పౌలు కొరింథిలో విభజింపబడిన సంఘమును గూర్చి ప్రస్తావించారు. విశ్వాసులందరు నాలుగు వర్గాలుగా విభజింపబడ్డారు. ప్రతి ఒక్క వర్గం తమ స్వంత నాయకుడిని అనుసరిస్తున్నారు. తర్వాత 18-31 వచనాలు చదివితే, రక్షణ అనునది క్రీస్తులో ఉందని, మానవ జ్ఞానంలో కాదని పౌలు గారు చెప్పారు. దేవుని జ్ఞానం మానవ జ్ఞానం కంటే ఎంత భిన్నమైనదో తెలుసుకుంటే కొరింథిలోని సంఘములో ఈ విభజనలు తొలగించబడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉరి గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయివున్నది. వినటానికి విచిత్రంగా ఉంది కదా? పౌలు సిలువను గూర్చి ఇచ్చిన సందేశాన్ని విన్నప్పుడు మొదటి శతాబ్దపు ప్రజలకు కూడా విచితంగా అనిపించింది.
పౌలు యొక్క కాలంలో, సిలువ వేయడం అనేది చాలా భయంకరమైన మరణశిక్షగా పరిగణించబడేది. ప్రజలు దీనిని ప్రస్తావించడానికి కూడా వెనుకాడేవారు. అందుకే చాలా మంది సిలువ సందేశాన్ని తిరస్కరించారు మరియు దానిని “వెఱ్ఱితనము” అని కొట్టివేశారు. కానీ క్రీస్తు యొక్క సిలువ సువార్తకు కేంద్ర బిందువు. సిలువ లేకుండా రక్షణ లేదు. మనము మన మంచి పనులపై ఆధారపడము, కాని క్రీస్తు సిలువపై పూర్తి చేసిన సిలువ కార్యం పై ఆధారపడతాము. అందుకే రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి.
ప్రార్థన: ప్రియమైన తండ్రీ, నేను ఎల్లప్పుడు క్రీస్తు సిలువను హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/