ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 5

దేవుని దేవునిలా ఉండనివ్వండి!


3:18-4:5: 1 కొరింథీయులకు 3:18-23 లో అపొస్తలుడైన పౌలు జ్ఞానం గూర్చి తిరిగి ప్రస్తావించారు. ఈ ప్రపంచ జ్ఞానంతో ఆధ్యాత్మిక నాయకులను మరియు బోధకులను తీర్పు తీర్చలేమని వ్రాసారు. దేవుని దృష్టిలో మానవ జ్ఞానం మూర్ఖత్వం. విశ్వాసులు దేవునికి చెందినవారని మానవ బోధకులకు కారని పౌలు వ్రాసారు. తర్వాత 4:1-5 లో క్రీస్తు సేవకులు దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులని పరిగణించాలని వ్రాసాడు. వారు చేసిన సేవ చివరికి క్రీస్తు ద్వారా తీర్పు తీర్చబడుతుంది.


మన పాపపు స్వభావం ఇతరులను త్వరగా తీర్పు తీర్చుతుంది మరియు ప్రేమించడం విషయంలో నిదానిస్తుంది. మనం తప్పుడు బోధలను మరియు పాపాన్ని ఖచ్చితంగా తీర్పు చెప్పాలి (మత్తయి 7: 15-16; 1 కొరింథీయులకు 2:15; 5: 9-13; యాకోబూ 4:4). కాని మనము ఇతరులను ఆధ్యాత్మిక అహంకారంతో (మత్తయి 7:1-2) లేదా అజాగ్రత్తగా (యోహాను 7:24) తీర్పు తీర్చకూడదు.


కొరింథీ విశ్వాసులలో కొందరు అపొస్తలుడైన పౌలును తీర్పు తీర్చడంలో తొందరపడ్డారు (వ. 3). కాని ప్రభువు తన అంతిమ న్యాయమూర్తి అని వ్రాసారు (వ. 4-5). కొన్ని సార్లు మనం కూడా ఇతరులను “సమయానికి ముందే” తీర్పు తీర్చుతుంటాము. అయితే ఒక వ్యక్తి హృదయం ప్రభువుకు మాత్రమే సంపూర్ణంగా తెలుసు. పాపంలో జీవిస్తున్న వారిని మనం ఎదుర్కోవాలి (5:12-13), కాని ఎవరు మంచి క్రైస్తవుడు లేదా ఎవరు మంచి సేవకుడు అని మనుము తీర్పు చెప్పకూడదు. దేవుని దేవునిలా ఉండనివ్వండి!


ప్రార్థన: పరలోకపు తండ్రి, ఇతరులను తీర్పు తీర్చడం విషయంలో నన్ను నెమ్మది పర్చండి మరియు ఇతరులను త్వరగా ప్రేమించడానికి సహాయం చేయండి.


ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/