ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రభువు విషయాల గురించి చింతించుట
7:25-40: 25-38 వచనాలలో, అపొస్తలుడైన పౌలు పెళ్లికాని క్రైస్తవులను వివాహం చేసుకోవద్దని సలహా ఇస్తాడు. దానికి ఆయన అనేక కారణాలు చెబుతారు. కొరింథీ సంఘము కొన్ని ఇబ్బందుల ద్వారా వెళ్తుంది (వ. 26). అలాగే ఈ జీవితంలో శ్రమలు ఉంటాయని (వ. 28) మరియు క్రీస్తు తిరిగి రావడానికి సమయం తక్కువగా ఉందని ఆయన గుర్తుచేస్తారు (వ. 29). ఇంకా వారు చింతల నుండి విముక్తి పొందాలని ఆయన కోరుకున్నారు (వ. 32). తర్వాత 39-40 వచనాలలో విధవరాలను తిరిగి వివాహం చేసుకోవద్దని సలహా ఇస్తాడు.
మన భారతీయ సంస్కృతిలో ఒంటరిగా ఉండటం ప్రతికూలంగా కనిపిస్తుంది. పెళ్ళి అయినప్పుడే వారి జీవితాలు పూర్తి అవుతాయని చాలా మంది అనుకుంటారు. కాని క్రీస్తు మరియు అతని రాజ్యంపై దృష్టి పెట్టడానికి దేవుడు కొంతమందిని ఒంటరిగా ఉండటానికి పిలుస్తున్నాడని మనం గ్రహించాలి. అయినప్పటికీ, అందరూ ఒంటరిగా ఉండటానికి పిలువబడరు.
కాని పెళ్లికాని ఒక విశ్వాసి చాలా చింతలనుండి స్వేచ్ఛగా ఉంటాడు. ఒంటరి క్రైస్తవుడికి జీవిత భాగస్వామి మరియు పిల్లలను చూసుకునే బాధ్యత ఉండదు. ఆ ఒంటరి విశ్వాసి ప్రభువు సేవ చేయడానికి ఎక్కువ సమయం మరియు శక్తిని కేటాయించగలడు. కాబట్టి మీరు ఒంటరిగా ఉండటానికి పిలువబడ్డవారయితే మీరు ఒంటరిగా ఉండటం మంచిది. మీరు ప్రభువు విషయాల గూర్చి మాత్రమే చింతించగలరు.
ప్రార్థన: ప్రభువా, మీపై మరియు మీ రాజ్యంపై దృష్టి పెట్టడానికి ఒంటరిగా ఉన్న క్రైస్తవులను బట్టి వందనాలు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/