ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 4

ప్రతిఫలమా లేక నష్టమా?


3:1-17: 3:1-9 లో, అపొస్తలుడైన పౌలు కొరింథీలో విభజింపబడిన సంఘమును గూర్చి ప్రస్తావించారు. తర్వాత 10-17 వచనాలలో ప్రభువు కోసం సరైన పద్ధతిలో సేవ చేయుట యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. మనకు జీతం ఇచ్చు రోజున సరియైన సేవకు ప్రతిఫలం లభిస్తుందని మరియు తప్పు రకమైన సేవ నాశనం అవుతుందని ఆయన వ్రాసారు. 


ప్రతి నెల మొదటి వారంలో చాలా మంది తమ జీతాలను అందుకుంటారు కాబట్టి వారు చాలా సంతోషంగా ఉంటారు. నెల ఆఖరి సమయానికి వారు జీతం కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. క్రీస్తు తన ప్రజలకు వారి పవిత్ర జీవితాలను బట్టి మరియు నమ్మకమైన సేవను బట్టి ప్రతిఫలమిచ్చే దినము (క్రీస్తు రెండవ రాకడ) కోసం మనము కూడా ఎదురుచూడాలి.


తీర్పు దినాన మన పని యొక్క నాణ్యత తెల్పబడుతుంది. మన పని యొక్క నాణ్యత అనగా మన జీవిత విధానం. దేవుని చిత్తానుసారమైన బోధనలు మరియు జీవితాలకు ప్రతిఫలం లభిస్తుంది. కానీ కొందరి జీవితాలు మరియు బోధనలు దేవుని వాక్యానికి అనుగుణంగా లేనందుకు ప్రతిఫలాలను కోల్పోతారు.


ప్రార్థన: ప్రియమైన తండ్రీ, నా జీవితము మరియు నా సేవ నీ దృష్టికి అంగీకారము అవునుగాక.



ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/