Logo de l'Aplicació de la Bíblia
Icona de cerca

యిర్మీయా 45

45
బారూకుకు సందేశం
1యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు: 2“బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఇలా అంటున్నారు: 3‘అయ్యో నాకు శ్రమ! యెహోవా నా బాధకు దుఃఖాన్ని జోడించారు; నేను మూలుగులతో సొమ్మసిల్లిపోయాను, నాకు నెమ్మది లేదు’ అని నీవు అనుకుంటున్నావు. 4అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు. 5‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

Subratllat

Copia

Compara

Comparteix

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió