హోషేయ 14
14
యెహోవా వద్దకు తిరిగివచ్చుట
1ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. 2నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు,
“మా పాపాన్ని తీసివేయి.
మా మంచి పనులను అంగీకరించు.
మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
3అష్షూరు మమ్మల్ని కాపాడదు.
మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము.
మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను
ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము.
ఎందుకంటే, అనాధుల పట్ల
జాలి చూపేది నువ్వొక్కడివే.”
యెహోవా ఇశ్రాయేలును క్షమించుట
4అందుకు యెహోవా ఇలా అంటాడు:
“నా కోపం చల్లారింది, కనుక,
నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను.
నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
5నేను ఇశ్రాయేలీయులకు మంచువలె వుంటాను.
ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు.
అతడు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
6అతని శాఖలు విస్తరిస్తాయి,
అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు.
అతను లెబానోనులోని దేవదారు చెట్లు
వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
7ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.
గోధుమ కంకుల్లాగ పెరుగుతారు.
ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు.
వారు లెబానోను ద్రాక్షారసంవలె ఉంటారు.”
విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా హెచ్చరిక
8“ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.
నీ ప్రార్థనలు ఆలకించేది నేనే. నిన్ను కాపాడేది నేనే.
నిరంతరం పచ్చగానుండే
మీ ఫలము నానుండి వస్తుంది.”
చివరి సలహా
9వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.
చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి.
యెహోవా మార్గాలు సరైనవి.
మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు.
పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
S'ha seleccionat:
హోషేయ 14: TERV
Subratllat
Copia
Compara
Comparteix
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International