ప్రణాళిక సమాచారం

గ్రేస్ గీతంనమూనా

 గ్రేస్ గీతం

DAY 5 OF 5

"వుయ్ విల్ రాక్ యు" అనే రాణీ గారి స్టేడియం గీతం మీకు బహుశా తెలిసి ఉండవచ్చు. ఇది సూపర్ బౌల్స్ నుండి ప్రపంచ కప్ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను సమీకరించింది.

కానీ ప్రజలు దీన్ని ఇష్టపడతారని రాణి కూడా అనుకోలేదని మీకు తెలుసా?

అందుకే వారు దానిని వారి ఆల్బమ్‌లో ప్రక్కన అంతగా ప్రాముఖ్యముగా మీరు యెంచని పాటలు వ్రాసే స్తలములో ఉంచారు. ఈ రోజు నేను మీకు "అద్భుతమైన కృప" పాట నుండి కొన్ని మాటలను మీకు వివరించాలని అనుకుంటున్నాను. అవి మీరు ఇప్పటివరకు గుర్తించి యుండకపోవచ్చు ... కానీ మీరు ఖచ్చితంగా వినాలి అనుకునే మాటలవి. దానిని ప్రక్కనుండి వచ్చిన దయగా భావించండి.

అవును, ఈ శరీరము మరియు హృదయము ఓడిపోయినప్పుడు

ఈ జీవనము ఆగిపోయినప్పుడు,

గుడారపు చాటున సంతోష మరియు సమాధాన

జీఐతాన్ని నేను పొందుకుంటాను.

ఆ పదాలు మీకు తెలుసా? అందరూ పాడ గలిగినంత సులువైన మాటలైతే కాదు. కానీ అవి తెలియచేసే వాగ్దానం మిమ్మల్ని జీవితంలో దేనినైనా సాధించునట్లుగా చేస్తుంది. నేను మీ కోసం దానిని విభజించి చెప్పనివ్వండి:

యేసు కారణంగా, మీ కథ విజయంతో ముగియని దృశ్యం ఒక్కటైననూ లేదు!

ఈ జీవితం మీకే సమస్య ఎదురైనా, మీరు సురక్షితంగా వున్నారని, ప్రేమించబడ్డారని, స్వస్థత పొందారని, సంపూర్ణంగా మార్చబడ్డారని మరియు దేవుని సన్నిధిలో ఆనందం మరియు శాంతితో నింపబడ్డారని చెప్పబడినప్పుడు మరియు చేయబడినప్పుడు నీవీ వాగ్దానంపై నిలబడవచ్చును.

యేసు సమాధి నుండి లేచి మరణాన్ని జయించినప్పుడు మీ కోసం భద్రపరచినది ఏమిటంటే - పరిపూర్ణ జీవితము. రక్షణ కోసం మీరు యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు, మీ కథలో మరణం కూడా చివరి పదం కాబోదు అనే వాగ్దానాన్ని మీరు అందుకున్నారు.

బిల్లీ గ్రాహం గారు ఒకసారి ఇలా అన్నారు:

"విశ్వాసికి సమాధికి మించిన నిరీక్షణ ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు తన మరణం మరియు పునరుత్థానం ద్వారా మనకందరికీ పరలోకపు ద్వారాన్ని తెరిచాడు."

అంతులేని, పగలని జీవితానికి ద్వారము విశాలంగా తెరిచివుంది ఎందుకంటే యేసు మొదట దాని గుండా వెళ్ళాడు. అతను సమాధిని జయించాడు, మరియు ఆయనలో, మీరు కూడా జయించగలరు! అందుకే మంచి శుక్రవారం - మరియు పునరుత్తాన ఆదివారం - చాలా సంతోషకరమైన వేడుకలు!

అయితే ఇది పలాయనవాదం లాగా ...పరలోకంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మీరు ఇక్కడ భూమిపై ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అనిపిస్తే, పౌలు 2 కొరింథీయులు 4:16-18లో ఏమి వ్రాశారో చూడండి:

"కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు."

ఈ వాగ్దానము యొక్క ప్రభావమును గమనించారా?

ఈ రోజు మీరు చేస్తున్న ప్రయాణానికి పరలోకం యొక్క నిరీక్షణ మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ ప్రపంచం మీకు చూపించేదేదీ మీ కోసం దేవుడు సిద్ధం చేసిన నివాసానికి సాటియైనది కాదని మరియు దేవుడు మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిగా మార్చడానికి ఈ ప్రపంచంలోని బాధను ఉపయోగిస్తాడని ఇది మీకు గుర్తు చేస్తుంది.

ఈ రోజు కోసం మీకు బలం ఉంది, మీ బాధలో ప్రయోజనం ఉంది మరియు నిరీక్షణలో ఆనందం ఉంది. కాబట్టి భయపడకండి, ఎందుకంటే యేసు ఇప్పటికే జయించాడు!

ఆశీర్వాదములు,

నిక్ హాల్

వాక్యము

Day 4

About this Plan

 గ్రేస్ గీతం

ఈ గ్రేస్ భక్తి గీతం ద్వారా మీ పట్ల దేవుని ప్రేమ యొక్క లోతులను కనుగొనండి. సువార్తికుడు నిక్ హాల్ మీపై పాడిన దేవుని కృప గీతంలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ శక్తివంతమైన 5-రోజుల భక్తితో మీకు మార్గనిర్దేశం చేస్తారు.

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము PULSE Outreachకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://anthemofgrace.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy