గ్రేస్ గీతంనమూనా
జీవితములో కష్టములు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ వున్నాడు?
మీరు ఎప్పుడైనా మంచి సమూహములో వున్నాము అని అనుకున్నారా? నేను అదే ప్రశ్న అడిగాను. ప్రతీ వ్యక్తి జీవితము ఇలానే ఉంటుంది. మీ జీవితములో స్థిరత్వం పోయినప్పుడు - మీరు అన్నివైపుల నుండి అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు అనిపించినప్పుడు - మనందరి స్పందన ఏమిటంటే, "దేవా, నువ్వెక్కడ వున్నావు?"
దానికి మీకు వచ్చే సమాధానం మీరు ఎప్పుడైనా వినగలిగే అత్యుత్తమ విషయాలలో ఒకటి.
రోమీయులకు 8:38-39 చూస్తే,
"మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను."
సరే, ఆ వాక్య ఆధారంగా, జీవితం కష్టతరమైనప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? లేదా మీ కుటుంబం విడిచి పెట్టినప్పుడు? లేదా మీ కలలు నిర్వీర్యమైపోతున్నప్పుడు దేవుడు ఎక్కడ వున్నాడు?
మీ బాధలన్నిటిలో నిన్ను ప్రేమించుచూ దేవుడు మీతో ఉన్నాడని - బైబిల్ చెబుతోంది.
ఇప్పుడు, “అది చాలా బాగుంది… అయితే అతను నా బాధను ఎందుకు తీసివేయడు?” అని బహుశా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు,
మంచి ప్రశ్న. చాలా మంది అడిగిన ప్రశ్నలలో ఇది ఒకటి. పై వాక్య భాగాన్ని వ్రాసిన అపొస్తలుడైన పౌలు అలానే అడిగాడు.
చాలా మంది ప్రజలు జీవితకాలంలో ఎదుర్కొనే దానికంటే పౌలు తక్కువ సంవత్సరాలలోనే ఎక్కువ హృదయ వేదన మరియు కష్టాలను భరించాడు. అతను కొట్టబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, ఓడ కూలిపోయింది మరియు ఖైదు చేయబడ్డాడు. అతని స్నేహితులు చనిపోయారు, ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు మరియు నిరాశతో పోరాడాడు. చివరికి, యేసును అనుసరించినందుకు పౌలు కూడా చంపబడ్డాడు.
ఒకానొక సమయంలో, పౌలు చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాడు. అది ఏమిటో మనకు కచ్చితంగా తెలియదు, కానీ అతను దానిని తన శరీరంలో ముల్లుగా అభివర్ణించాడు. బహుశా అది అనారోగ్యం, మానసిక అనారోగ్యం లేదా దీర్ఘకాలిక నొప్పి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, అతను దానిని తట్టుకోలేకపోయాడు మరియు దానిని తీసివేయమని దేవుడిని వేడుకున్నాడు.
దేవుడిచ్చిన సమాధానం ...
"నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది... " (2 కోరింథీయులకు 12:9)
అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? పౌలు కష్టపడుతున్నా ఆయన పట్టించుకోలేదా?
వాస్తవానికి ఆయన పట్టించుకుంటాడు. మీ జీవితంలోని నొప్పి గురించి పట్టించుకున్నట్లే పట్టుంచుకుంటాడు. యేసు "నొప్పి తెలిసిన" వ్యక్తి అని ఎప్పటికీ మరచిపోకండి. ఆయనకు దుఃఖం తెలుసు. యెషయా 53:3 చెప్పినట్లు ఆయనకు మన బాధ తెలుసు. మనలను అర్ధం చేసుకుంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు.
కానీ మీకు మరియు నాకు చాలా అవసరమైనది - ఈ ప్రపంచానికి చాలా అవసరమైనది - పరిస్థితులలో మార్పు కాదు, కానీ హృదయ పరివర్తన.
యేసు మీ జీవితంలోకి వచ్చినప్పుడు అదే చేస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని బాధ నుండి విముక్తి చేయడం కంటే బాధలగుండా నడిపించడములో మీ జీవితంలో ప్రదర్శించే నిరీక్షణ అదే.
ఆయన ఇలా అంటాడు, “నేను దీని ద్వారా మిమ్మల్ని గమనించనున్నాను. దీని ద్వారా నిన్ను తీర్చిదిద్దబోతున్నాను. మరియు అన్నింటికంటే నాకు అవసరమైన ప్రపంచానికి నా దయను ప్రదర్శించడానికి నేను నిన్ను ఉపయోగించబోతున్నాను".
కాబట్టి మీరు ఈరోజు ఎలాంటి కష్టాలు, హృదయ వేదనలు లేదా బాధలు ఎదుర్కొంటున్నా, దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు అనే వాగ్దానంతో శాంతిని పొందండి, యేసులోని ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఏదీ వేరు చేయదు మరియు మీకు కావలసిందల్లా ఆయన దయ మాత్రమే. అప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో పాడగలరు ...
నేనిప్పటికే అనేక ప్రమాదాలు, కష్టములు మరియు ఇబ్బందులను
దాటుకుంటూ వచ్చాను
ఈ కృపయే నేటికినీ నన్ను కాపాడినది
మరియు కృప నన్ను గమ్యానికి చేర్చుతుంది.
ఆశీర్వాదములు,
— నిక్ హాల్
ఈ ప్రణాళిక గురించి
ఈ గ్రేస్ భక్తి గీతం ద్వారా మీ పట్ల దేవుని ప్రేమ యొక్క లోతులను కనుగొనండి. సువార్తికుడు నిక్ హాల్ మీపై పాడిన దేవుని కృప గీతంలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ శక్తివంతమైన 5-రోజుల భక్తితో మీకు మార్గనిర్దేశం చేస్తారు.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము PULSE Outreachకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://anthemofgrace.com/