గ్రేస్ గీతంనమూనా
యేసును అనుసరించడం గురించి నాకు ఇష్టమైన విషయం కూడా యేసును అనుసరించడం గురించి నాకు కనీసం ఇష్టమైన విషయం.
అదెలానో చెప్పనివ్వండి….
దేవుడు నన్ను తన కుటుంబంలోకి ఆహ్వానించడం నాకు చాలా ఇష్టం. నాలో అర్హమైనదేదీ లేదు. నేను చేసిన పాపాలకు కేవలము శిక్షకే పాత్రుడను, మరియు వాటిని సరి చేయడానికి నేను చేయగలిగినదేదీ లేదు. అదేలాంటిదంటే ఆ కుటుంబములో చేరే అవకాశమే లేదు ... దానికి కట్టాల్సిన రుసుము ఎంతో ఎక్కువ ... కానీ దేవుడే ముందుకు వచ్చి నా రుసుము చెల్లించాడు.
అది కృప
అయితే ఇక్కడ విషయమేమిటంటే... దేవుని కృప ప్రతీ ఒక్కరికి చివరికి మీ జీవితాన్ని కష్టతరం చేసే వ్యక్తులతో సహా.
మనందరి జీవితంలో మనల్ని కూల్చివేసే, తప్పు మార్గంలో నడిపించే మరియు సాధారణంగా మనల్ని వెర్రివాళ్ళను చేసే వ్యక్తులు వుంటారు. బహుశా అది మీకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి కావచ్చు. లేదా ఎవరైనా ఆన్‌లైన్‌లో వ్యక్తులైయుండవచ్చు.
ఈ రోజు మన ప్రపంచంలో చాలా సార్లు, మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు మనం ఎప్పుడూ కలవని వారు; ప్రముఖ వ్యక్తియో, రాజకీయ పార్టీకి చెందిన వారో లేక , టిక్‌టాకులో పేరు సంపాదించుకున్న వ్యక్తియై యుండవచ్చు.
ఎవరైనప్పటికీ, సాధారణ విషయం ఏమిటంటే, ఎవరైనా మనల్ని కించపరిచినప్పుడు, "వారు" అవుతారు.
ఎలాగంటే, మీరు వారితో తర్కించలేరు. మీరు వారితో మాట్లాడలేరు. మీరు వారిని గౌరవించలేరు. మీరు వారిని ప్రేమించలేరు.
మనుషులను దూషించడంలో మరియు ఖండించడంలో మానవులకు నైపుణ్యం ఉంది - తరచుగా ప్రజలందరూ - మనల్ని మనం నిర్ధారించుకోవడానికి ఎప్పటికీ ఉపయోగించని ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. నేను అలానే చేస్తాను. మీరు కూడా చేస్తారని నేను పందెం వేస్తాను.
కానీ దేవుని మహిమ ఆయనలా చేయడు!
ఎందుకంటే కృప గురించిన విషయం ఏమిటంటే మనందరికీ అది అవసరం. మరియు దానిని స్వీకరించిన తరువాత, దేవుడు తన అద్భుతమైన దయను ఇతరులకు విస్తరించమని మిమ్మల్ని మరియు నన్ను పిలుస్తున్నాడు.
కొలొస్సయులకు 3:13 లో,
"ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి".
దేవుడు తన ప్రేమకు నాకు రుణపడి లేడు. అతను నన్ను క్షమించటానికి రుణపడి లేడు. ఆయనతో నాకు సంబంధం కలిగియుండటానికి లేదా పరలోకంలో నిత్యజీవం గురించి రుణపడి లేదు. అదంతా స్వచ్ఛమైన దయ మాత్రమే. కాబట్టి, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం మేమంటే: దేవుని నుండి అటువంటి అద్భుతమైన కృపను మనం ఎలా పొందగలము మరియు దానిని ఇతరులకు అందించకూడా ఎలా ఉండగలం?
కృప అంటే ఎవరైనా చెప్పే లేదా చేసే ప్రతిదానితో మీరు అంగీకరిస్తున్నారని కాదు. కృప అంటే మీరు లోకంలో పాపం లేకుండా చయడమని కాదు. కృప అంటే మీరు సరైనదాని కోసం నిలబడరని కాదు.
కృప అంటే మీరు ఎవరినైనా ఖండించరు లేదా వారు మిమ్మల్ని బాధపెట్టారు లేదా ఏదైనా తప్పు చేసారు కాబట్టి మీ ప్రేమను నిలిపివేయరు. ఎందుకు?
ఎందుకంటె దేవుడు నిన్ను అలానే ప్రేమించాడు ... మరియు వారిని అలానే ప్రేమిస్తున్నాడు.
ఆశీర్వాదములు,
— నిక్ హాల్
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ గ్రేస్ భక్తి గీతం ద్వారా మీ పట్ల దేవుని ప్రేమ యొక్క లోతులను కనుగొనండి. సువార్తికుడు నిక్ హాల్ మీపై పాడిన దేవుని కృప గీతంలో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ శక్తివంతమైన 5-రోజుల భక్తితో మీకు మార్గనిర్దేశం చేస్తారు.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము PULSE Outreachకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://anthemofgrace.com/