హోషేయ 6
6
యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు బహుమతులు
1“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం.
ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు.
ఆయన మనలను గాయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
2తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు.
మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు.
అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
3మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము.
ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం.
సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే
ఆయన వస్తున్నాడని మనకు తెలుసు.
యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు.
నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
ప్రజలు నమ్మకస్తులు కారు
4“ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి?
యూదా, నిన్ను నేను ఏమి చేయాలి?
నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది.
వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
5నేను ప్రవక్తలను ఉపయోగించి
ప్రజల కోసం న్యాయచట్టం చేశాను.
నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు.
కాని, ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
6ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే.
అంతేగాని బలిఅర్పణ కాదు.
ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక
దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
7అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు.
వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
8గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం.
ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
9బందిపోటు దొంగలు దాగుకొని,
ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు.
అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు.
వారు దుర్మార్గపు పనులు చేశారు.
10ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను.
ఎఫ్రాయిము దేవునికి అపనమ్మకస్తుడు.
ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
11యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది.
బానిసత్వంనుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”
S'ha seleccionat:
హోషేయ 6: TERV
Subratllat
Copia
Compara
Comparteix
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: