పశువుల పాకకు ప్రయాణమునమూనా

ఆయనను వెదకుటకు ప్రేరేపించబడుచున్నాము
క్రీస్తు యొక్క పుట్టుక సమయములో, ఆకాశమందు ఒక నూతనమైన నక్షత్రము వెలసెను. ఏ రాజు యొక్క రాకను గూర్చి ముందుగా చెప్పబడెనో ఆ రాజును వెదుకుతూ తూర్పు ప్రాంతముల నుండి ఒక జ్ఞానుల బృందమును, సుదీర్ఘ ప్రయాణం చేసి రప్పించునంతగా దాని యొక్క వెలుగు ఆకర్షించెను. వీరు గొప్ప జ్ఞానం కలిగిన పశ్చిమ ఆసియా వారు, జ్ఞానమును వెదుకుతూ తమ జీవితాలను గడిపిన తత్వవేత్తలు, పూజారులు మరియు జ్యోతిష్కులునై యున్నారు. అయినప్పటికి, వారి ఆత్మీయ వెదుకులాటలో, వారు ఇంకా పొందుకొవాలనే తృష్ణ గలిగినవారై యుండెను.
తమ యొక్క సౌకర్యవంతమైన జీవితాలను మరియు గౌరవనీయమైన వృత్తులను విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడి, అత్యంత కఠినమైన పరిస్థితుల ద్వారా, మునుపెన్నడూ ఎరుగని మార్గాల గుండా ఈ ప్రమాదకరమైన ప్రయాణము చేయడానికి వారు తమ సమస్తాన్ని పణంగా పెట్టారు. కాని వారి హృదయములు ఒక శక్తివంతమైన రక్షకుడు పుట్టుననే గుర్తుతోనే ముద్రించబడి, ఆయనను కనుగొనెంత వరకు వెదకుటకు వారు ప్రేరేపించబడిరి.
ఆ జ్ఞానుల వలెనే, ఒక్కసారి మనం యేసుని ముఖా-ముఖిగా కలుసుకొనినప్పుడు, మన యొక్క మానవ జ్ఞానమంతటిని ఇష్టపూర్వకముగా ప్రక్కన పెట్టగలము. అనంతమైన ఆయన జ్ఞానము యొక్క ప్రత్యక్షతలో, మనము వెదుకుచున్న ఆయనను సంతోషముతో ఆరాధించుదుము.
ఇది చేయండి:ముందుగానే చెల్లించు! ఈసారి మీరు ఒక కప్పు కాఫీకి వెళ్ళినప్పుడు, వరుసలో నీ వెనుకనున్న వ్యక్తికి కూడా రుసుము చెల్లించుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More