అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట నమూనా

నాల్గవ దినము:ఆయన యొక్క నెమ్మదిని వెదకుడి
కేవలం ఏ పనిని నిలిపివేయాలో చూచుటకు మరియు మీ జాబితాలోని తక్షణ కర్తవ్యముపై దృష్టి పెట్టడానికి ఒక్కసారి ఇలా ఆలోచించండి, ఈ పండుగ సిద్ధపాట్లలో నుండి విరామం తీసుకొని కొంత సమయము యేసుని సన్నిధిలో కూర్చోనుమని పరిశుద్దాత్మడు నిన్ను ప్రేరేపించినట్లు మీకెప్పుడైనా అనిపించిందా?
నాకనిపించిందని నాకు తెలుసు.
పని చేయు ప్రతి గంటకు దాని పూర్తి ఫలితాన్ని పొందాలనే తపనతో, వేకువజామునే నిద్రలేస్తూ మరియు రాత్రి పూటలు ఎకువ సేపు మేల్కొని ఉంటూ, బహు వేగంతో పరుగెత్తేవైపే మనల్ని మనం తరచుగా నెట్టివేసుకుంటాము. తరువాత మన శ్రమంతటిని బట్టి నీరసించిపోయి, ఈ పండుగ కాలము యొక్క నిజమైన అందాన్ని ఆస్వాదించలేము.
కొన్నిమార్లు, ఈ హడావిడి అంతా మన అంతరంగపు గాయములను దాచిపెట్టుకునే ఒక మారువేషముగా మిగిలిపోవును. కేవలం మనల్ని మనం బిజీగా ఉంచుకొనగలిగితే, మనం భరించే గాయాలను మనము గుర్తించాల్సిన పని లేదు. ఊరకుండుట అంటే మనకు భయం, అందుకే ఒక్కసారి దిద్దుబాటు చేసుకొనుమనే ఆవశ్యకత మనలను తొందర చేసినప్పటికి, అన్ని పనులు హడావిడిగా చేసేస్తు ఉంటాము
దీనికి సమాధానము మన యొక్క ఆచారలన్నిటిని ప్రక్కకు నెట్టేసి మనమొక సాధువుగా ఉండాలని కాదు కాని, మనమొక ప్రశాంతమైన మరియు నెమ్మది కలిగిన స్థితి నుండి పని చేయుటకు- ఇటువంటి హడావిడి సమయములలోనే, ఆయన సన్నిధిలో ఊరక నిల్చుండే సందర్భములను కూడా పొందుపరుచుకోవాలి. వాస్తవమేమనగా, దేవుని రక్షణ మనము పశ్చాత్తాపడి, ఆయనలో విశ్రాంతి నొందినప్పుడును మరియు ఆయన బలము మనము విశ్వసించి నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రమే మన యొద్దకు వచ్చును.
ఈ క్రిస్మస్ పండుగ కాలములో, రోజుకి కనీసం రెండు నిమిషముల పాటైనా ఆయన సన్నిధిలో ఊరక నిలిచి ఉండుటకు సాహాసించుము. నీ యొక్క పనుల జాబితాను ప్రభువు నొద్దకు తీసుకు వచ్చి ఆయన పాదాల వద్ద పెట్టుము. ఆయన నామములను ధ్యానించే ఈ సమయములో, ఆయన సన్నిధిలోని సంతోషాన్ని పొందుకొని, నీ అంతరంగములోని లోతైన గాయములను కట్టుటకు ఆయనను అనుమతించుము.
నీ జీవితముపై ఆయన యొక్క అధికారమును ప్రకటించుము; ఆయనకొరకైన నీ ఖచ్చితమైన అవసరతను తెలియజేసి, నిన్ను నీవు ఊరక ఉండుటకు అనుమతించుకొనుము. ఆయన సన్నిధిని ఆస్వాదించుము.
ఆయన ఇమ్మానుయేలు-అనగా దేవుడు మనకు తోడు.ఆయన చూచును. ఆయన వినును. తన ప్రేమతో నిన్ను నిమ్మలపరచును.
ప్రార్థన:ప్రభువా, నీ ప్రేమతో నా హృదయమును నిమ్మలపరచు. ఎగసిపడుతున్న అలలతో ఏ విధముగా మాట్లాడి నిమ్మలపరచావో, అదే విధముగా నీ శాంతిని నా జీవితము మీద మాట్లాడుము. అత్యంత సన్నిహిత వ్యక్తిని కొల్పోయిన బాధ నుండి, కూలిపోయిన నా కలల నుండి, విచ్చిన్నమైన నా ఆశల నుండి నాకు స్వస్థతను మరియు సమకూర్పును దయ చేయుము. పునరుత్థానమును జీవమునైన నీవే, నా ప్రాణములో నిర్జీవమైన భాగములకు నూతన జీవమును ప్రసాదించుము. భవిష్యత్తు కొరకు ఒక నూతనమైన నిరీక్షణను వెలిగించుము. జీవమును అనుగ్రహించే- నీ సన్నిధిని పొందుకొనుటకు ఊరక నిలిచి యుండుట నాకు నేర్పుము. ఆమెన్
ఈ ప్రణాళిక గురించి

ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.
More
సంబంధిత ప్లాన్లు

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

అద్భుతాల 30 రోజులు

హింసలో భయాన్ని ఎదిరించుట

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్
