అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట నమూనా

మొదటి దినము: క్రిస్మస్ సమయములో మనకెందుకు విశ్రాంతి కావాలి
"హోలీ కొమ్మలతో హాళ్ళను అలంకరించండి" అను అర్ధముతో సుపరిచిత ఆంగ్ల క్రిస్మస్ పాట ప్రారంభమగును. అదే విధముగా మనము కూడా ప్రారంబిద్దాము.
చలి కాలము మొదలగుటతోనే కొంతమంది క్రిస్మస్ కు సిద్దపడుతుంటారు, మరి కొంతమంది ఇది అనివార్యమైనా దీనిని ఎంతవరకు పోడిగించగలరో అంతవరకూ పొడిగిస్తారు.
కాని ఏదోక సందర్భములో మనందరమూ ఈ కార్యక్రమముల ఊభిలో చిక్కుకుంటాము—ఇది చాలామట్టుకు సంబరాలతో కూడుకున్నదైనప్పటికి మన ప్రాణములను పనిపాట్లతో సొమ్మసిల్ల చేసే విధముగా ఇది నీరసింప చేస్తుంది. తరచుగా, మనము పండుగ వాతావరణమంతటి మధ్యలో "ఉన్నదంతా ఇంతేనా?" అని ఆశ్చర్యపోతుంటాము. శుభవార్త అంటే పిండి వంటల ఫలహారాలు, దుకాణాల్లో కొనుగోలు చేయవలసినవి, మరియు అలంకరణ వంటి విషయాల కాదు, శుభవార్త అనగా దేవుని కుమారుడు మన కొరకు మానవునిగా అగుట.
మనము మన పనిపాట్లలో పూర్తిగా నిమగ్నమైపోయే తత్వము గలవారమని దేవునికి తెలుసు. ఇందుకొరకే —తమ కార్యకలాపాలలో కొంత ఎడతెరపి కలిగి, తమ దేవుని యొక్క మంచితనమును, వ్యక్తిగతంగా ఆయన యొక్క అవసరతను, మరియు ఆయన బహుమానమైన తన విశ్రాంతిని గుర్తిస్తారని ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రతి ఆరు రోజులకు ఒక విశ్రాంతి దినమును ఏర్పాటు చేయుటలో ఇది కూడా ఒక కారణమై యున్నది.
ఈ విశ్రాంతిని అవలంబించుటలో, మన పనిని నిలిపినప్పటికి, ఆయన మన పనిని కొనసాగిస్తున్నాడనే దేవుని విశ్వాస్యతను మనము గుర్తించెదము. ఆయన మన ప్రపంచముపై అధీనమును కలిగియున్నాడు
ప్రభువు తన శిష్యులను ఏకాంతముగా తనతో పాటు వచ్చి కొంచెముసేపు అలసట తీర్చుకొనుమని ఆహ్వానించిన విధముగా, మీకిష్టమైన పండుగ ఆచారముల నడుమ, ఈ సంవత్సరము క్రిస్మస్ యొక్క అద్భుతము మరియు ఆనందమును తిరిగి కనుగొనుటకు నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను.
కాని అది ఎలా ఉంటుంది?
తదుపరి నాలుగు రోజులలో, ఆయన మంచితనమును జ్ఞాపకము చేసుకొంటూ, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని వెదుకుతూ, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ, విశ్రాంతి అను పదము యొక్క వాస్తవ భావమును గ్రహించి ప్రశాంతమైన ఆరాధనను ఆచరించెదము.
ఈ క్రిస్మస్ పండుగకు ఆయన యొక్క ఆహ్వానమును నీవు అంగీకరించెదవా? కొంతసేపు ఈ హడావుడికి దూరముగా వచ్చి విశ్రాంతిని పొందండి.
ప్రార్థన:ప్రభువా, నా గురించి నీకు బాగా తెలియును. నా కుటుంబము మరియు స్నేహితులతో చక్కటి సమయమును గడపాలని నేనెంత ఎదురుచూస్తానో నీకు తెలుసు, నేను మితిమీరిన కట్టుబడులతో, అతిగా స్పందిస్తూ, ఎడతెరపి లేని పనులు పెట్టుకుంటూ, వాటిల్లో మునిగిపోయి, చివరికి మిక్కిలి భారములు మరియు ఒత్తిడులే నన్ను వేటాడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము నాకు అలా అవ్వకూడదు. కావున, నేను చాచిన చేతులతో మరియు తెరచిన హృదయముతో నీ దగ్గరకి వస్తున్నాను. ఇదిగో నీ చెంతనున్నాను. విశ్రాంతి కలిగిన స్థలములో మా రక్షకుని యొక్క పుట్టుక వేడుకను జరుపుకొనుటను నాకు నేర్పించుము. నీ యొక్క సౌందర్యమునకు ఆశ్చర్యచకితునయ్యే విధముగా మరియు నీ స్తుతిని ప్రచురించుటకు నా హృదయమును సమ్మతిపరచుము. ఆమెన్
ఇంకా కావాలా?డౌన్లోడ్ అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్ఆంగ్లములో యేసు యొక్క నామముల పట్టికను పొందుకొనుము, విశ్రాంతి ప్రార్థన సూచిక, క్రిస్మస్ విశ్రాంతికొరకు అచ్చువేయబడిన ప్రార్థన
ఈ ప్రణాళిక గురించి

ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.
More
సంబంధిత ప్లాన్లు

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

అద్భుతాల 30 రోజులు

హింసలో భయాన్ని ఎదిరించుట

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్
