యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

40 యొక్క 28

మనం భూమిపై జీవిస్తున్నప్పుడు మనం భూమి యొక్క పౌరులం,ప్రత్యేకంగా మనం పుట్టిన దేశం యొక్క పౌరులం. మనం ప్రభువైన యేసును మన జీవితాలలోనికి అంగీకరించినప్పుడు,మనం దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకొనబడ్డాము మరియు పరలోక పౌరులం అయ్యాము. మన భూసంబంధమైన బాధ్యతలు మరియు విధుల నుండి మనం మినహాయించబడ్డామని దీని అర్థం కాదు. మనకు ఇప్పుడు ద్వంద్వ పౌరసత్వం ఉందని అర్థం. అంటే మనం భూమిపై తిరుగుతూ,మన ఉద్యోగాలలో పని చేస్తున్నప్పుడు,మన కుటుంబాలను నడుపుతున్నప్పుడు మరియు ఇతరులతో సంభాషించేటప్పుడు,మన నుండి ఆశించిన పనులను మనం తప్పక నెరవేర్చాలి. మనం మన వృత్తి అయినా లేదా మన దైవిక పిలుపు అయినా దేవుని పట్ల అత్యంత భక్తితో,ఆయనను సంతోషపెట్టాలని మరియు వీక్షించే లోకానికి ఆయన ప్రేమను కనుపరచాలని కోరుతూ ప్రతి దానినీ మనం చేస్తాము. మనం ద్వంద్వ పౌరసత్వం ఉన్న వ్యక్తులుగా జీవించినప్పుడు పవిత్ర మరియు లౌకిక మధ్య విభజన అదృశ్యమవుతుంది.

మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నేను నివసించే దేశానికి నమ్మకమైన పౌరుడిగా ఉన్నానా?
నేను భూమిపై పరలోకపు పౌరుడిగా బాధ్యతాయుతంగా జీవిస్తున్నానా?

ఈ ప్రణాళిక గురించి

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/