యేసుతో ముఖాముఖినమూనా

ధనవంతులు మరియు దేవుని రాజ్యం అనేది దేవుని పరిమాణపు తికమక సమస్య. వారికున్న సమస్త సంపదలతో, దేవుడు తీసుకువచ్చే చొరవ లేదా ఏర్పాటు అవసరం లేదు. లోక ప్రమాణాల ప్రకారం ధనవంతులుగా ఉండటం దేవుని రాజ్యంలో ధనవంతులుగా ఉండటంతో సమానం కాదు. అంటే ప్రతి ధనవంతుడు తమ వద్ద ఉన్నదంతా దేవుని నుండి వచ్చినదని మరియు వారు ఆశీర్వాదంగా ఉండేలా ఆశీర్వదించబడ్డారని గ్రహించే చోటుకు రావాలి. మనకు ఉన్నదంతా దేవుని నుండిమాత్రమే వచ్చింది, మన సంపదను వృద్ధి చెందించేసామర్థ్యం,సంపాదించడం మరియు నిల్వ చేయడం కూడా ఆయన నుండి వచ్చిన ఆశీర్వాదమే. సంపద గురించి మనకున్న అవగాహన నుండి మనం దేవుణ్ణి వేరు చేసినప్పుడు,సమస్య అందులోనే ఉంటుంది. స్వార్థపూరిత ఆశయం,దురాశ,నిల్వ ఉంచడం మరియు గర్వం వంటి కొన్ని పాపాలు లోపలికి వస్తాయి.
డబ్బు చెడ్డదని యేసు ఎప్పుడూ చెప్పలేదు. "డబ్బు యొక్క ప్రేమ" చెడుకు మూలకారణమని ఆయన చెప్పాడు. భూమ్మీద కాకుండా పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకోవాలనే సూత్రాన్ని ఆయన చాలా బోధించాడు. మనం ఆశీర్వదించబడిన వాటితో ఉదారంగా ఉండాలనే స్పృహ కలిగి ఉండటమే మనం దానిని చేయగల ఒక మార్గం. పేదవారు మరియు తక్కువ వనరులు కలవారు మన చుట్టూ ఉన్నారు. వారికి ఆశీర్వాదంగా ఉండటానికి మనం ఒక మార్గాన్ని కనుగొనే సమయం ఇది.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
లోక ప్రమాణాల ప్రకారం లేదా దేవుని రాజ్యం ప్రకారం నేను ధనవంతుడిగా భావిస్తున్నానా?
ఈ రోజు నేను ఎవరిని ఆశీర్వదించగలను?
ఈ ప్రణాళిక గురించి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/