ప్రణాళిక సమాచారం

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికినమూనా

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి

DAY 5 OF 5

మీరు బాధితులు కారు

బాధకు బలైపోయేవారికి, గెలిచి నిలబడేవారికి మధ్య గొప్ప వ్యత్యాసముంది. బాధితులు “నేను” మరియు “ఇప్పుడు” అనే దృష్టినుండి మాత్రమే చూస్తారు. గెలిచి నిలబడేవారు దేవుడనుగ్రహించిన దృష్టితో సుదూరంలో ఉన్నవాటిని ఉన్నతమైనవాటిని లోతైనవాటిని చూస్తారు. వీటిని వీరు ఆనందాన్నిచ్చేవిగా లెక్కిస్తారు, దేవుని జ్ఞానంకొరకు ఆయన నడుగుతారు,నిత్యత్వపు దృక్పథాన్ని అవలంబిస్తారు, ప్రేమచేత ప్రేరణ పొందుతారు.

గెలిచి నిలబడేవారి దృక్పథంతో, మీరు నిరుత్సాహాన్ని అధిగమించడానికి మీకు కావలసినవన్నీ ఉన్నాయి.

అయితే మీరు ఇంకా పోరాడవలసి ఉన్నారు. మీరు శ్రమలెదురైనప్పుడు మీ సమస్యలేమిటో వర్గనిరూపణ చేసే ఈ మూడు ప్రశ్నలతో పోరాడండి:

1.నా విశ్వాసం నశించిపోయేవాటిలో ఉన్నదా లేదా నిత్యత్వానికి సంబంధించినవాటిలో ఉన్నదా?

ఈ నేపథ్యంలో మీ పరిస్థితుల్ని అంచనా వేసుకోండి. మీ నమ్మిక ఎందులో – శాశ్వతమైనవాటిలోనా లేదా నశించిపోయేవాటిలోనా? కష్టాలు నష్టాలు ఇబ్బందులు కఠినపరిస్థితులు మిమ్మల్ని బలోపేతం చేయగలవు లేదా మిమ్మల్ని బద్దలు చేయగలవు.ఉన్నతమైనవాటిమీద మీ దృష్టిని నిలిపి ఉంచడాన్ని కోరుకొనండి.

2.నా నిరీక్షణను నిర్ణయించేవి నా సమస్యలా లేదా దేవుని వాగ్దానాలా?

మీ సమస్యలు తొలగిపోతాయని మీరు ఎదురుచూస్తున్నారా లేదా దేవునియొక్క దీర్ఘకాలిక ఉద్దేశాలకొరకు ఆయన ప్రణాళికలకొరకు ఎదురుచూస్తున్నారా? మీ సమస్యలు పెద్దవిగాను దేవుడు చిన్నవాడుగాను ఉన్నాడని అనుకుంటున్నారా? లేదా, దేవుడు గొప్పవాడుగాను మీ సమస్యలు చిన్నవి గాను ఉన్నాయని అనుకుంటున్నారా? ఏ దృష్టితో చూడాలో మీరే నిర్ణయించుకోండి, మీ దృష్టి మీ సమస్యల మీద నిలిచి ఉంటుంది లేదా మీ దృష్టి దేవునివాగ్దానం మీద నిలిచి ఉంటుంది, అంతేగానీ ఏకకాలంలో రెండింటిమీద నిలిచి ఉండదు. మీలో నిరీక్షణ నిండుగా ఉండాలని మీరే నిర్ణయించుకోవాలి.

3.నా ప్రధాన ప్రేరణ క్రీస్తును ప్రేమించడం కొరకేనా లేదా కేవలం శ్రమలనుండి విశ్రాంతి పొందడం కొరకేనా?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అన్నిసార్లు అంత సుళువు కాదు. అయితే నేను ప్రపంచవ్యాప్తంగా శ్రమల్లో సైతం దేవుణ్ణి సేవిస్తున్న అనేకమంది విశ్వాసుల్ని చూస్తున్నప్పుడు నాకు ప్రేమదృశ్యాలే కనబడతాయి. వారికొరకు తన ప్రాణాన్నర్పించిన యేసుకొరకు ఎటువంటి కష్టాన్నైనా సహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

మీరు నిరుత్సాహపడడం మొదలైనప్పుడు ఈ ప్రశ్నల్లోని మూడు పదాల్ని గుర్తుంచుకోండి: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ.

1.విశ్వాసం అన్నీ దేవుని అధీనంలోనే ఉన్నాయనే వాస్తవానికి మీ హృదయాన్ని మీ మనసును లంగరు
వేస్తుంది.

2.మీకొరకు దేవునిదగ్గర ప్రణాళిక మరియు వాగ్దానం ఉన్నాయని నిరీక్షణ మీకు గుర్తుచేస్తుంది.

3.ప్రేమ మీ దృష్టిని కష్టాలమీదనుండి ఆయనకొరకు శ్రమపడడం మీ భక్తికొక వ్యక్తీకరణ అనే ఆధిక్యతమీదకు మరల్చుతుంది.

నేడు ధైర్యాన్నిచే ఈ మాటల్ని ధ్యానించండి. మనం కొద్దికాలం మాత్రమే ఉండే సమస్యల్ని కాక నిత్యత్వపు వాస్తవాల్ని చూచేలా ఇవి మనకు సహాయపడతాయి. కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం ను ఆచరణాత్మకంగా అభ్యసించడంద్వారా మనం శ్రమలనుండి బయట పడడం మాత్రమే కాదు, జీవకిరీటాన్ని అందుకొనే విజేతలుగా ఉంటాం.

వాక్యము

Day 4

About this Plan

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి

ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవ...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/product/art-of-survival-book/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy