ప్రణాళిక సమాచారం

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికినమూనా

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి

DAY 3 OF 5

అడగవలసిన వనరు

దేవునినుండి ఒక ఖాళీ చెక్‌ ఉందని ఊహించుకోండి – అది జ్ఞానంగురించి పరిమితుల్లేని వాగ్దానం. ఎక్కడ నివసించాలో, ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఉద్యోగం కోల్పోయినప్పుడు పరిస్థితినెలా ఎదుర్కోవాలో లేదా ఈ రోజు ఎలా గడుస్తుందో మొదలైన విషయాల్లో ఆయనను మీరు అడగవచ్చు.

అయితే ఒక షరతు. ఆయన మీకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నడవడానికి మీరు సమర్పణతో సిద్ధపడాలి.

ఈ షరతులో రెండు భాగాలున్నాయని నేటి వాక్యపఠనం తెలియజేస్తోంది:

·మీరు “సందేహింప” కూడదు – పరిగణనలోకి తీసుకొనదగిన ఏదో ఒక సమాచారంలాగా లేదా సలహా లాగా మీరు దేవుని జ్ఞానాన్ని చూడకూడదు. మీరు విశ్వాసంతో జ్ఞానాన్ని అంగీకరించాలి, మీకు నచ్చిన విషయాల్లో మాత్రమే విధేయత చూపించాలనుకొనకూడదు. అలా చేయడం ద్విమనస్కత అవుతుంది. ద్విమనస్కతతో చేసే ప్రార్థన “ఏదో చూద్దాంలే” అన్నట్టుగా ఉంటుంది.

·మీరు “విశ్వాసముతో”అడగాలి – మీరు విశ్వాసంతో దేవుణ్ణి సమీపించాలి. అంటే ఇది నిర్దిష్టమైన విజ్ఞప్తిని సూచిస్తుంది. ఇది ఆయనను విశ్వసించడాన్ని, ఆయన స్వభావంపట్ల ఆయన వాక్కుపట్ల కచ్చిత మైన నమ్మిక కలిగి ఉండడాన్ని, మరియు ఆయన మీకు చూపించినదానిని చేయడంపట్ల మీలో ఉన్న సమర్పణను సూచిస్తుంది.

మనం క్రుంగిపోయి నిరుత్సాహపడుతున్నప్పుడు ఏవైపు చూడాలో దిక్కుతోచనప్పుడు దేవుడు పరలోక

సంబంధమైన జ్ఞానం అనే అద్భుతమైన వనరును వాగ్దానం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని వినడానికిమరియు ఆయన చూపించినది చేయడానికి మన హృదయాలు సంసిద్ధంగా ఉన్నట్లయితే – కచ్చితంగా మనం ఏమి చేయవలసి ఉన్నామో దానినే ఆయన మనకు చూపిస్తాడు, ఎలా చేయాలో చూపిస్తాడు, ఎవరితో చేయాలో చూపిస్తాడు.మనం ఏం వినాలని కోరుకుంటున్నామో అలా ఆయన జ్ఞానం ఉండకపోవచ్చు. అయితే ఆయన జ్ఞానంచొప్పున నడవాలని మనం తీర్మానించుకున్నట్లయితే ఆయన తన జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడు.

ప్రభువు ఇస్తున్న వనరును నేడే అంగీకరించండి. జ్ఞానంకొరకు ఆయనను అడగండి, ఆయన జ్ఞానంకొరకు మీ నేత్రాల్ని మీ చెవుల్ని మీ హృదయాన్ని సిద్ధపర్చుకోండి. ఆయన తన జ్ఞానాన్నెలా ఇస్తాడో మీరే చూడగలరు.

వాక్యము

Day 2Day 4

About this Plan

కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి

ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవ...

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/product/art-of-survival-book/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy