విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుటనమూనా

పొంగి పోర్లుటకు నింపబడుట
ఆత్మతో నింపబడుట అనగా- నా యొక్క సమస్తమును ఆయన శక్తికి అప్పగించుకొనుటయే. పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తి తనను తాను అప్పగించుకున్నప్పుడు, దేవుడే స్వయంగా ఆ వ్యక్తిని నింపును. - ఆండ్రూ ముర్రే
మనకి విశ్రాంతి ఎందుకవసరమనగా మనం నిత్యము పని చేస్తుంటాము గనుక లేక ఏదోక విధముగా మన శక్తిని ఉపయోగిస్తాము. మనం ఎలా విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకున్నాము మరియు విశ్రాంతిని అనుభవించాం గనుక, మనమెల్లప్పుడు అదే విధంగా ఉంటామని దానర్థము కాదు.
మనం మరలా పని చేస్తాము.
మరలా మనం ఇతరులకు సహాయం చేస్తాము.
మరలా మనం మానసికంగా అలసిపోతాము.
కేవలం విశ్రాంతి కొరకే మనం విశ్రాంతిని పొందుకొనుటలేదు. కాని మరలా పని చేయుటకు మనం విశ్రాంతి తీసుకుంటాము. పని చేయుట మరియు విశ్రాంతి తీసుకొనుటలలో ఒక చక్కటి ఎత్తుపల్లములు కలవు; పొంగి పోర్లుటకు ముందుగా మనం నింపబడాలి.
ముందు తెలియజేయబడిన విధంగా, దేవుని వాక్యమును ధ్యానించటం, వ్రాసుకొనుట మరియు మనల్ని పరధ్యాన పరచే విషయాల నుండి వైదొలుగుటకు చేసే మనం ప్రయత్నాలే మనల్ని తిరిగి నింపును. అనుదినం వీటిని మనం చేస్తున్నప్పుడు ఆ విశ్రాంతిని మనం పొందుకొనగలము. మన శారీరక దేహములకు ప్రతి రాత్రి కొన్నిగంటల విశ్రాంతి ఎలా అవసరమో, మన ప్రాణములకు అలాగే విశ్రాంతి కావాలి. మన ప్రాణములకు విశ్రాంతినిచ్చే వాటికెంత మాత్రం అవకాశం ఇవ్వకుండా వాటిని బలమైనవిగా, స్థిరమైనవిగా ఉండాలని మనం ఆశించలేము. ఒక్క వారం రోజుల విశ్రాంతి మనలను నెలల తరుబడి నడిపించగలవని మనం అనుకోకూడదు. మనం జీవించుటకు మన యొక్క విశ్రాంతి పాత్రను అనుదినము నింపాలి. మరియు ఎప్పుడైనా ఆ విశ్రాంతి పాత్ర నుండి అనేకమార్లు తీసుకొన్నప్పుడు అది ఖాళీ అవుతున్న సమయములో మనం శ్రద్ధ వహించాలి.
Leading on Empty: Refilling Your Tank and Refueling Your Passion, అను తన పుస్తకంలో, దాని రచయిత మరియు పాస్టర్ వెన్ కార్డియరో తనకు వచ్చిన ఒక కల గురించి మనకు ఈ విధముగా తెలియజేసెను. ఒక ఫారం నందలి పని చేస్తున్న ఒక రైతునొద్దకు ఒక స్త్రీ వచ్చి అతని దగ్గర లేనిదానిని ఒకటి అడిగింది. "రేపు రండి, అప్పుడు నా దగ్గర చాలా ఉంటాయి.", అని అతను చెప్పెను. అది ఆమెను నిరుత్సాహపరచినప్పటికి అతను మాత్రం దానిగురించి చింతించలేదు. అతను తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు తన ఫారం వద్దకు ప్రజలు వస్తూ ఉంటారు, తన దగ్గర గుడ్లు లేక పాలు అయిపోయినప్పుడు, "రేపు రండి, అప్పుడు నా దగ్గర చాలా ఉంటాయి.", అని అతను చెప్పేవాడు. తన కల ముగిసేటప్పటికి, పాస్టర్ కార్డియరో తాను గ్రహించిన నూతన సంగతిని ఇతరులతో పంచుకున్నాడు.
ఇప్పటి పనులను ముగించుకుంటూ మరియు గతవారంలో మిగిలిపోయియున్న పనులను చేస్తూ ఉండే ఊహాతీతమైన, నిరంతర పని ఒత్తిడి చక్రంలో నన్ను నేను చిక్కించుకోవాలని అనుకోవట్లేదు. దినములో నాకున్న కొద్దిపాటి సమయములో నేను చేయగలిగిన పనిని హృదయపూర్వకముగా చేయాలనుకుంటాను. పనిసమయం అయిపోయినప్పుడు, "రేపు రండి, అప్పుడు నా దగ్గర చాలా ఉండును." అని చెప్తాను.
ప్రతిదినము మనం కొంతమొత్తంలో మానసిక, భావోద్వేగ మరియు శారీరిక శక్తితో నిద్ర మేల్కోనెదము. మనం చేయగలిగిన దానంతటికి మన శక్తిని ధారపోసిన పిమ్మట, మనం తప్పక విశ్రాంతి తీసుకోవాలి. ఇటువంటి నిస్సత్తువ స్థితిలో మనమున్నప్పుడు, మన జీవితములయందు ఆయన పని చేయుటకు మన దగ్గర చాలా తక్కువ శక్తి ఉండును.
ఆయన మీద ఆనుకుని, ఊరక నిలిచి, ఆయనలో విశ్రాంతి తీసుకోండి. దేవుని ఆత్మతో నింపబడుటకు ఇదే తగిన సమయము.
ఆలోచించండి
- నీ కళ్ళతో చూసిన ప్రతి అవసరతను నీవు తీర్చుకోవాలని నీకనిపించిందా?
- నీవు మరలా నింపబడుటకు దేనిని నీ జీవితంలో అలవరచుకోవాలి అని అనుకుంటున్నావు? ఈనాటి బైబిల్ ధ్యానము లేక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రత్యేక్షతను వ్రాసుకోండి
ఈ ప్రణాళిక గురించి

మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోవాలి లేనిచో మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొనుటకు మరియు మనం ప్రేమించే వ్యక్తులకు మనవంతుగా ఇవ్వటానికి ఏమి మిగిలియుండదు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి నేర్చుకొనుటకు మరియు మనము నేర్చుకొనిన దానిని మన జీవితాలలో ఎలా అవలంబించాలో రాబోయే ఐదు రోజులలో తెలుసుకుందాము.
More
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

30 రోజుల్లో కీర్తన గ్రంధం

హింసలో భయాన్ని ఎదిరించుట

గ్రేస్ గీతం

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక
