విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుటనమూనా

దేవుని వాక్యమును ధ్యానించుట
బైబిల్ ను మనం ఎంత ఎక్కువగా చదువుతావో; మరియు ఎంత ఎక్కువగా వాక్యమును ధ్యానిస్తావో, అంత ఎక్కువగా దానిచేత ఆశ్చర్యచకితులమగుదుము. - ఛార్లెస్ స్పర్జన్
క్రీస్తు నందు విశ్వాసముంచిన అనేకులకు అసలు ధ్యానము అంటే ఏంటో సరైన అవగాహన లేదు. మనము దేనినైనా ధ్యానిస్తున్నాము అంటే మన యొక్క తలంపులను దానియందు కేంద్రీకృతము చేయుటయే. దీనిని సరిగ్గా అర్థము చేసుకొనుటకు, దేవుని వాక్యమును ధ్యానించుటను గూర్చి పాస్టర్ రిక్ వారెన్ గారిచ్చిన నిర్వచనమును ఒకసారి చదువుదాము. "ఆశ్చర్యకరంగా, నీకు చింతించటం ఎలాగునో తెలిస్తే, నీవు దేవుని వాక్యమును ధ్యానించుటను గూర్చి కూడా నీకు తెలిసినట్లే. చింతించుట అనగా ఒక రకమైన బాధించే ఆలోచనను పదే పదే ఆలోచిస్తూ ఉండుట. అదే నీవు లేఖనముల యందు ఒక భాగమును తీసుకొని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, దానినే ధ్యానమని అంటారు." అని ఆయన తెలియజేసారు.
ఇంచుమించు ఇరవై సార్లు ధ్యానమును గూర్చి బైబిల్ తెలియజేస్తూ మరియు దేవుని వాక్యమును ధ్యానించుటకు పిలుపునిచ్చెను. దేవునితో అనుదినము సమయమును గడుపుట ద్వారా మనకు మానసికంగాను మరియు భావోద్వేగ పరంగాను ఇది విశ్రాంతినిస్తూ మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే ఒక మేలుకరమైన అలవాటుగా ఉన్నది.
ప్రతి దినము బైబిల్ చదువుటకు మనం సమయము గడుపుతుండంగా, వాక్య భాగములను లోతుగా గ్రహిస్తూ దేవునితో ఒక సంభాషణను మొదలుపెట్టవచ్చు. ఒకటి లేదా రెండు వచనములను ఎలా ధ్యానించవలెనో తెలుసుకొనుటకు, మొదటగా ఎఫెస్సి 4:31-32 వాక్యవిభజన చేద్దాం, "సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి." అని తెలియజేయుచున్నది.
మరలా ఇంకొకసారి చదివి దేవుని అడుగుదాము:
నేను ఎవరి మీదనైన ద్వేషము కలిగియున్నానా?
ఊరకనే కోపపడే వ్యక్తినా?
నా మాటలు కటినముగా ఉన్నాయా?
నా హృదయము మృదువుగా ఉన్నదా?
నేను ఇతరులను స్వేచ్చగా క్షమించ గలుగుతున్నానా?
అటు పిమ్మట మనము దేవుని యొక్క శక్తివంతమైన మరియు నిమ్మలమైన స్వరము కొరకు వేచియుండి దానిని వినవలెను. చాలా అరుదుగా అది మనకు వినబడేదిగా ఉండును అయినప్పటికి ఆయన మనకి ఏమి చెప్పుచున్నాడో అది మనకు తెలియును. ఈ వాక్య ధ్యానంశములను మనతో పాటు మన రోజులోనికి తీసుకువెళ్ళటం ద్వారా మన ఆలోచనలలోని ద్వేషము, కోపము, క్రోధము, హృదయ కాటిన్యము లేక క్షమించలేక పోవుట అనేవి మనకు తెలియబడును.
దేవుని వాక్యమును ధ్యానించడమంటే ఇదే.
మనము దేవుని వాక్యమును ధ్యానించునప్పుడు లేఖనములలోని సత్యములను మన హృదయములలోనికి చొచ్చుకొనిపోవును. ధ్యానము ఒక నూతనమైన విశ్రాంతిని మనకిచ్చును ఎందుకనగా మన మనస్సులను ఈ లోకముయొక్క చింతలతో నింపుకొనక మన మానసిక శక్తిని దేవుని వాక్యమును గూర్చి ఆలోచించుట ద్వారా వ్యయపరుస్తున్నాము. అంతేకాదు, జీవితములను మార్చగల దేవుని మాటలను మన జీవితములోనికి అన్వయింప చేసుకొనగల శక్తి కూడా మనకి ఉంది. ఈ విధముగా మనము ప్రయత్నిస్తున్నప్పుడు మనము ఏమి కావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విధముగా మార్పునొందగలము.
ఆలోచించండి
- ఈనాటి ధ్యాన భాగాములోనిదిగాని లేక మీకు నచ్చిన వాక్య భాగమును ఎంచుకొని, దానిని ధ్యానించండి. దానిని చదువుతూ ఉన్నప్పుడు, ఎక్కడ నీవు దేవునికి విధేయత చూపిస్తున్నావో మరియు నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏ విషయములో నీవు మార్పులు చేసుకొనవలెనో దేవుని కోరండి. ఈ నూతన అంశమును ఈ రోజంతటిలో మీ ఆలోచనలలో చొచ్చుకొనిపోనివ్వండి. ఈనాటి బైబిల్ ధ్యానము లేక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రత్యేక్షతను వ్రాసుకోండి
ఈ ప్రణాళిక గురించి

మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోవాలి లేనిచో మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొనుటకు మరియు మనం ప్రేమించే వ్యక్తులకు మనవంతుగా ఇవ్వటానికి ఏమి మిగిలియుండదు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి నేర్చుకొనుటకు మరియు మనము నేర్చుకొనిన దానిని మన జీవితాలలో ఎలా అవలంబించాలో రాబోయే ఐదు రోజులలో తెలుసుకుందాము.
More
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

30 రోజుల్లో కీర్తన గ్రంధం

హింసలో భయాన్ని ఎదిరించుట

గ్రేస్ గీతం

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక
