కీర్తనలు 68:19-27 - Compare All Versions

కీర్తనలు 68:19-27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా మన దేవుడు రక్షించే దేవుడు; ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది. దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు, అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు. ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను; సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.” మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి. దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు. ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు. మహా సమాజాలలో దేవుని స్తుతించండి; ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి. చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, యూదా నాయకుల గొప్ప సమూహం, జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.

షేర్ చేయి
కీర్తనలు 68 TSA

కీర్తనలు 68:19-27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త. మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు. దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు. ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను. నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు. దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు. చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు. సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి. మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.

షేర్ చేయి
కీర్తనలు 68 IRVTEL

కీర్తనలు 68:19-27 TERV (పవిత్ర బైబిల్)

యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు. దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు. నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు. గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు. మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి. చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

షేర్ చేయి
కీర్తనలు 68 TERV

కీర్తనలు 68:19-27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా–నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.

షేర్ చేయి
కీర్తనలు 68 TELUBSI