కీర్తనల గ్రంథము 68:19-27
కీర్తనల గ్రంథము 68:19-27 TERV
యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు. దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు. నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు. గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు. మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి. చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.




