కీర్తనల గ్రంథము 91:1-8

కీర్తనల గ్రంథము 91:1-8 TERV

మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు. “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబుతాను. దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు. రాత్రివేళ నీవు దేనికి భయపడవు. పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు. చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు. నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు. నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు. ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా నీకు కనబడుతుంది.