ప్రణాళిక సమాచారం

అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా

Chasing Carrots

DAY 3 OF 7

ఇతరుల నుండి ఆమోదాన్ని వెంటాడుట



అసలు విషయమేమిటంటే: ఆమోదం అనునది మీరు కోరుకునే విషయం. ఇదేదో ఎర చూపి గాలం వేయటం వంటిది కాదు కాని కొద్దిసేపు మేము చెప్పే విషయమును ఆలకించండి.



ఆమోదం అనేది మనం తప్పక కోరుకోవాలి. కాని ఎవరి ఆమోదాన్ని కోరుతున్నావనే దానిపై అది నిన్ను మంచిగానైనా చేయగలదు లేక అది నిన్ను క్రుంగ దీయగలదు కూడా.



మన జీవితంలో ప్రజల ఆమోదం కొరకు మనము బద్దులమై యున్నాము. పిల్లలుగా ఉన్నప్పుడు, మనం మంచి పనులు చేసినప్పుడు, పెద్దలు మనల్ని మెచ్చుకుంటారు. వారి మెప్పును మనము ఆనందిస్తాము గనుక, మంచి పనులను చేయుటను మనం తరువాత కూడా కొనసాగిస్తాము. స్కూల్ లో ఉన్నప్పుడు, మన టీచర్ల నుండి మెప్పు పొందాలని లేక మన తోటివారి నుండి అంగీకారాన్ని పొందాలని ఎంతో కష్టపడి చదువుతాము. ఒక్కసారి ఉద్యోగాల లోనికి వెళ్ళిన తరువాత, మన బాస్ లను మెప్పించాలనే ఆశతో ఎక్కువ గంటలు పనిచేస్తాము, లేక పెద్ద ఇళ్ళు మరియు మంచి కార్ల లాంటివి కొని మన కుటుంబము నుండి మన స్నేహితుల నుండి గౌరవమును పొందాలని ఆశిస్తాము.



ప్రజల ఆమోదాన్ని పొందుకొనుటలో మనం సఫలమయ్యాక, మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాము. ప్రపంచం అందంగా కనిపిస్తుంది. నూతన ఉత్తేజముతో మనం అడుగులు వేస్తాము. మన యొక్క ఆత్మ గౌరవం బలపడుతుంది.



అయితే.



ఈ మార్గములో "అయితే" అనే పదం ఒకటి ఉంటుందని మీకు తెలుసు.



చివరికి, ఆ వ్యక్తులలో ఎవరో ఒకరు మీకు ఆ ఆమోదాన్ని ఇవ్వడంలో విఫలమవుతారు. అది జరిగినప్పుడు, ఇక అంతా గందరగోళంగా మారుతుంది. ఇది మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు.



మీరు తప్పు వ్యక్తుల దగ్గర ఆమోదాన్ని వెతుకుతున్నారని కాదు కాని, ప్రజల నుండి నీవు కోరుకునే ఆ ఆమోదాన్ని నీవు ఎప్పటికి పూర్తిగా పొందుకొనలేవు. ఆమోదాన్ని గూర్చిన లోతైన నీ ఆశతో కేవలం దేవుడు మాత్రమే మాట్లాడగలడు. అప్పుడేం జరుతుందో తెలుసా? ఆయన యొక్క ఆమోదం పొందడానికి మీరు మీ నెత్తిపై నిలబడవలసిన అవసరం లేదు లేక మరే విధంగా నటించాల్సిన పని కూడా లేదు. క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి, ఆయనను నీ జీవితమునకు ప్రభువుగా చేసుకున్న ఆ క్షణమే, నీవు దేవుని చేత ఆమోదాన్ని పొందావు. ఇక అంతే. ఎందుకనగా అక్కడి నుండి నీవు దేవుని బిడ్డగా మారినొందావు.



ఇదంతా కూడా మునుపు మీరు వినియుండవచ్చును. కాని నేడు, దాన్ని మీరు అనుభవించండి. మీకు కావాల్సిన - మిమ్మల్ని ఎప్పటికి వమ్ము చేయని ఆమోదమంతా కూడా మీరు పొందుకున్నారు. ఇక మీదట మీ యొక్క విలువ సురక్షితం, మరియు నీ తండ్రియైన దేవుని అంగీకారములో నీవు ఇక నిశ్చింతగా ఉండవచ్చును.



ఆలోచించండి:ప్రస్తుతం నీవు ఎవరి యొక్క లేక దేని కొరకు ఆమోదాన్ని వెతుకుతున్నావు? ఈ అవసరత తీరుటకు దేవుని ఆమోదమును అనుమతించిన తరువాత ఇతరులతో నీ యొక్క సంబంధ బాంధవ్యాలలో ఎలాంటి మార్పులు వచ్చును?


Day 2Day 4

About this Plan

Chasing Carrots

మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసము...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు https://www.life.church/ దర్శించండి

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy