ప్రణాళిక సమాచారం

అందని దానికొరకు పడే తాపత్రయంనమూనా

Chasing Carrots

DAY 2 OF 7

ఘనతను వెంటాడుట



ఘనతకు గ్రీకు పదమైన-phēmēఫ-మ గా పలికే ఈ పదము క్రొత్త నిబంధనలో కేవలం రెండు సార్లు మాత్రమే ఉపయోగించబడింది. తరచుగా అది సందేశము, రిపోర్ట్ లేక వార్తలుగా నిర్వచించబడును. లూకా 4:14 లో phēmē ను ఈ విధంగా ఉపయోగించారు.



అప్పుడు యేసు ఆత్మ బలముగలవాడై గలిలైయకు తిరిగి వెళ్లెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.



ఎక్కడినుండి యేసు తిరిగి వెళ్ళుట ద్వారా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందతట వ్యాపించెను? ఒకసారి ఆ సందర్భమేమిటో తెలుసుకుందాం. లూకా 1 లో, యేసు యొక్క పుట్టుకను గూర్చి మనం వింటాము. లూకా 2 లో, ఆయన పుట్టుట మరియు పిల్లవానిగా ఎదుగును. లూకా 3 లో, ఆయన బాప్తీస్మము నొందెను. ఆఖరికి, లూకా 4 యొక్క మొదటి వచనాలలో, యేసు ఉపవాసము ఉండుటను మరియు సాతాను చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడును. ఇప్పుడు మనము లూకా 4:14కి తీసుకొని వచ్చును.



అప్పుడు యేసు ఆత్మ బలముగలవాడై గలిలైయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. లూకా 4:14



ఈనాటి ధ్యాన భాగములో, అరణ్యములో యేసు శోధనను ఎదుర్కొన్న కధనాన్ని చూస్తాము. ఆ అరణ్యములో యేసు 40 రోజులు ఉండెను, అటువంటి సమయములో, సాతాను తానే తప్పు రకమైన ఆహారము (లూకా 4:3-4), ఘనత (లూకా 4:5-8) మరియు విశ్వాసము (లూకా 4:9-12)లతో యేసును శోధించెను. ప్రతి సారి, యేసు శోధనను తిరస్కరించి దేవుని వాక్యముతో ప్రతిస్పందించెను.



లూకా 4:14 లో చూపబడిన ఘనత వంటిదాన్నే మనమెల్లప్పుడు వెంటాడము కదా? కాని అరణ్యములో యేసునకు సాతాను చూపిన వంటివాటి వైపే మనం వెళతాము. సంతృప్తి లేని సరఫరా (లూకా 4:3-4), త్యాగము లేని ఘనత (లూకా 4:5-8), మరియు లోబడలేని రక్షణ (లూకా 4:9-12).



నీ యొక్క పనిలో గుర్తింపు కొరకు, సోషల్ మీడియా లైకులను మరియు ఇతరుల నుండి ప్రశంసను గూర్చి ఒక్కసారి ఆలోచించుము. ఆ క్షణమునకు అది సంతోషాన్నిచ్చును కాని దాని తరువాత నీకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. మనము గనుక యథార్ధముగా ఆలోచిస్తే, మనము కూడా గుర్తింపు పొందాలని మరియు దేనిలోనైనా ప్రావీణ్యులమని పేరు పొందాలనే సందర్భములు మనము కూడా అనుభవించి యుండవచ్చును. అదే విధంగా, సాతాను కూడా యేసు నకు ధనము, బలము మరియు కీర్తిని ఎర చూపెను. యేసు కూడా మనవలె శోధింపబడెను, కాని ఆయన దానిలో ఒక్క దానిని కూడా ఆశించలేదు.



దేవాలయ శిఖరమున యేసును నిలువబెట్టి అక్కడినుండి క్రిందికిదుముకుము తద్వారా దేవుడు తనను కాపాడుటకు దూతలను పంపించుననే - సాతాను యొక్క చివరి శోధనను కూడా ఇక్కడ మనం చదువుతాము. నీవెప్పుడైన నీవు ప్రార్థించే విషయాలు నీవనుకున్న విధంగా, నీ సమయములో జరగే విధంగా దేవుని బలవంతపెట్టే ప్రార్థించాలని నీవనుకున్నావా? అది దేవుని అంతగా ఘనపరచేది కాదు- అందుకే మనమ దేవుని శోధింపకూడదనే విధంగా యేసు అక్కడ ప్రతిస్పందించెను.



గ్రీకులకు పురాతన కాలంలో వ్రాయబడిన పునఃనిర్మిత భాషయైన PIE—Proto-Indo-European— అను ఒకటి కలదు. ఈ PIE మూల పదమే phēmē,, అనగా "ప్రకాశించుట" మరియు "తెలుపుట" అని అర్థము నిచ్చును. కావున మన యొక్క మూలములకు మనము వెళ్ళుదము. మనము వెలుగుగా ఉండుటకు చేయబడలేదు- అది కేవలం యేసు మాత్రమే- కాని మనము ఆయన వెలుగును ప్రకాశించుటకు పిలువబడ్డాము. మనము వాక్యము కాదు-అది కూడా యేసే నని యోహాను సువార్త చెబుతుంది-కాని లోకమంతటికి మనము ఆయన వాక్యమును తెలుపుకుటకు పిలువబడ్డాము.



ఘనతను వెంటాడుట అంటే దేవుని వైపు కాకుండా దేవునికి సంబంధించిన దాని వెంబడి పరుగెత్తుట. బైబిల్ నందు ఇది చాలా పురాతనమైన శోధన. దానికి లొంగిపోవద్దు. ఘనతను గూర్చిన శోధన తరువాత ఎప్పుడైనా నీకు ఎదురైతే, అప్పుడు యేసు చేసినట్లు చేయండి. ఆయన మాటలను పలుకుట ద్వారా ఆయన వెలుగును ప్రకాశించండి. అలా నీవు చేసినప్పుడు, లూకా 4:14 నెరవేరును. ఆయన ఘనత అంతటా వ్యాప్తి చెందును.



ప్రార్థన: దేవా, ఈ ప్రయత్నము నన్ను నీ వెలుగును ప్రకాశించకుండా అడ్డుగా ఎలా నిలుపుతుందో తెలియజేయుము? నాకున్న సమస్తముతో నిన్ను వెంబడించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.


Day 1Day 3

About this Plan

Chasing Carrots

మనమందరము ఎల్లపుడు ఏదో ఒక దానిని వెంటాడుతూనే ఉంటాము. సాధారణముగా అది మనకు అందీ అందనట్లుగానే ఉంటుంది - ఒక మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లు, ఒక పరిపూర్ణ కుటుంబము లేక ఇతరుల నుండి మెప్పు వంటివి అయివుండవచ్చు. కానీ ఇదంతా ఏంతో ప్రయాసము...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Life.Church వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు https://www.life.church/ దర్శించండి

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy