1
మత్తయి సువార్త 27:46
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?” అని అర్థము.
Ṣe Àfiwé
Ṣàwárí మత్తయి సువార్త 27:46
2
మత్తయి సువార్త 27:51-52
ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి.
Ṣàwárí మత్తయి సువార్త 27:51-52
3
మత్తయి సువార్త 27:50
యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.
Ṣàwárí మత్తయి సువార్త 27:50
4
మత్తయి సువార్త 27:54
శతాధిపతి అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.
Ṣàwárí మత్తయి సువార్త 27:54
5
మత్తయి సువార్త 27:45
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
Ṣàwárí మత్తయి సువార్త 27:45
6
మత్తయి సువార్త 27:22-23
అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
Ṣàwárí మత్తయి సువార్త 27:22-23
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò