ప్రణాళిక సమాచారం

హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా

హింసలో భయాన్ని ఎదిరించుట

DAY 1 OF 7

భయం కలిగే సందర్భాలలో పారిపోవడం

యేసు శిష్యులు ఆయనను అనుసరించాలని నిర్ణయం తీసుకున్న రోజు నుండి ఆయన సిలువ వేయబడే వరకు ఆయనతో కలిసి ఉన్నారు. అయితే,హి౦సి౦చబడిన మొదటి సందర్భములో,వారు ఆయనను అనుసరించకుండ పారిపోయారు! ముప్పు వచ్చినప్పుడు,భయం అనేది ఒక సాధారణ మానవ భావోద్వేగం. ఈ శిష్యులకు భయం లేకపోతే,వారు మానవులు కాదు! భయం మనల్ని పోరాటానికైనా లేక పారిపోవడానికైనా సిద్ధం చేస్తుంది. వారు హి౦స,మరణం అనే భయ౦ ను౦డి బయటపడలేకపోయారు,కాబట్టి యేసు పట్టుబడి సిలువ వేయబడినప్పుడు అందరూ పారిపోయారు. మనం కూడా భయంగా ఉన్న క్షణాల్లో బలహీనంగానే ఉంటాం. పేతురువలె మన౦ క్రీస్తును ఎప్పటికీ కాదనబోమని ఒప్పుకున్నప్పటికీ,పరిశుద్ధాత్మపై ఆధారపడకపోతే అలా చేసే అవకాశ౦ ఉ౦ది.

ఈ వచనంలో పేర్కొన్న యువ శిష్యుడు కూడా తన దిగంబరత్వాన్ని కప్పి ఉంచిన వస్త్రాన్ని వదిలేసి ప్రాణాల కోసం పారిపోయాడు. ఏదేమైనా,వారి కథలన్నీ చివరికి వారు ప్రభువును ఎన్నడూ విడిచిపెట్టలేదని చూపిస్తాయి! ఈ యువకుడు సువార్త రచయిత మార్కు అని చాలా మంది పండితులు సూచిస్తున్నారు. ఎంత అద్భుతమైన పరిణామం! ఆయన తన సంఘాన్ని నిర్మించడానికి వారిని హి౦సల ను౦డి లేపాడు! భయ౦వల్ల హి౦సల మధ్య పారిపోయిన వారిలో మీరు ఒకరు కావచ్చు,కానీ తిరిగి వచ్చి సంఘాన్ని పునర్నిర్మి౦చే అవకాశ౦ మీకు ఇప్పటికీ ఉ౦ది.

కట్టుబడి,ప్రార్థించండి:

హింసలకు భయపడి మీరు చాలాసార్లు పిలుపు నుండి పారిపోలేదా?

ఒకసారి మన౦ హి౦సకు భయపడి పారిపోయినప్పటికీ,మన౦ తిరిగి ఆ స౦కల్పానికి వచ్చి, సంఘాన్ని నిర్మి౦చునట్లుగా ప్రార్థిద్దా౦.

Day 2

About this Plan

హింసలో భయాన్ని ఎదిరించుట

ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ...

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy