యేసుతో ముఖాముఖినమూనా

వారు ఏమి చేశారో తెలియని ప్రజల పక్షంగా యేసు తాను చేయని నేరానికి సిలువ మీద వ్రేలాదదీయబడ్డాడు. తన చివరి క్షణాలలో,యేసు తన పక్కన వేలాడదీయబడిన ఇతర నేరస్థులలో ఒకరితో సంభాషణ చేసాడు. ఈ వ్యక్తికి యేసు ఎవరో మంచి అవగాహన ఉంది మరియు ఆయన నేరస్థుల పక్కన చంపబడటం ఎంత అన్యాయమో అతనికి బాగా తెలుసు. యేసుకు చేసిన అతని అభ్యర్థన అతని గమ్యాన్నే శాశ్వతంగా మార్చి వేసింది. యేసు తన రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు తనను జ్ఞాపకం ఉంచుకోవాలని ఆ దొంగ మనవి చేసాడు. మరియు వారు పరలోకంలో కలిసి ఉంటారని యేసు వాగ్దానం చేసాడు. ఎంతటి గొప్ప నిశ్చయత! యేసును విశ్వసించే ప్రతి ఒక్కరికీ అనుగ్రహించబడిన గమ్యంఇదే.వారు అంతము వరకు బలంగా ఉంటారు, మరియు సహనంతో ఉంటారు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
యేసులో నిత్యజీవం గురించి మీకు నిశ్చయత ఉందా?
మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఉందా?
ఈ ప్రణాళిక గురించి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/