యేసుతో ముఖాముఖినమూనా

యేసుతో ముఖాముఖి

40 యొక్క 22

ఒక మనుష్యుడు యేసు యొక్క దృష్టిని ఆయన కోసం బయట వేచి ఉన్న తన తల్లి మరియు సహోదరులు వైపుకు పిలుస్తాడు. యేసు తన చుట్టూ ఉన్నవారికి దేవుని యొక్క రాజ్యం గురించి కొంచెం ఎక్కువగా బోధించడానికి ఆ సాధారణమైన క్షణాన్ని కూడా ఉపయోగించుకుంటాడు. తన తల్లి మరియు సహోదరులు పరలోకములో ఉన్న తండ్రి యొక్క చిత్తాన్ని చేసిన వారు (తన శిష్యుల వలె) అని ఆయన ఆ మనుష్యునికి చెప్పాడు. యేసు చెప్పిన విషయం, ఒకసారి మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనను అనుసరిస్తే,మనం దేవుని యొక్క కుటుంబం లోనికి దత్తత తీసుకొనబడతాము.

మనం ఇప్పుడు క్రీస్తుతో సహ వారసులం (పౌలు చెప్పినట్లుగా). మనం ఇప్పుడు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలము,ఆయన ముందుకు ధైర్యముతో రాగలము. ఆయన ప్రతి విశ్వాసిని పుత్రత్వము యొక్క ఉన్నతమైన స్థానానికి ఎత్తాడు,అది దానితో పాటు గొప్ప ఉద్దేశాలను మరియు గొప్ప బాధ్యతలను కూడా తెస్తుంది! క్రీస్తు యేసులో మనకు లభించే అనేక అనేక ఆశీర్వాదాలలో కొన్నింటిని పేర్కొనడానికి ఉచిత ప్రవేశము మరియు నిత్యమైన వారసత్వం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మనము కలిగిఉన్న కొన్ని బాధ్యతలు శ్రమలను మనలో దాని పనిని పూర్తి చేయడానికి అనుమతిస్తాయి మరియు ప్రతి దినము పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడి మరియు పునరుద్ధరించబడుతున్నాయి,తద్వారా మనం ఆయనకు మహిమను తీసుకువస్తాము.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
దేవుని యొక్క కుటుంబం యొక్క భాగం కావడం వలన నేను ఎలాంటి ప్రయోజనాలను కనుగొంటాను?
ఒక దేవుని యొక్క బిడ్డగా ఉంటూ నేను ఏ బాధ్యతలను తప్పించుకున్నాను?

ఈ ప్రణాళిక గురించి

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/