హృదయ శత్రువులునమూనా

ఆండీ స్టాన్లీ:హృదయము యొక్క శత్రువులు
ఆధ్యాత్మిక సందేశం మూడవ రోజు
"కోపమును మరియు బాధను విడిచిపెట్టుట"
వాక్యము: ఎఫెస్సి 4:25-32
కోపము హృదయము యొక్క రెండవ శత్రువు. మనము ఏది కోరుకుంటామో అది మనకు దొరకకపోయినప్పుడు మనము కోపగించుకుంటాము.
కోపపడే ఒక వ్యక్తిని మీరు నాకు చూపించండి నేను మీకు బాధపడ్డ ఒక వ్యక్తిని చూపిస్తాను. తమ నుండి ఎదో తీసుకొని యున్నారు కాబట్టే వారు బాధపడ్డారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదో విషయంలో ఎవరో వీరికి రుణపడియున్నారు.
"నీవు నా మర్యాదను పోగొట్టావు." "నీవు నా కుటుంబాన్ని దోచుకున్నావు." "నా జీవితంలోని శ్రేష్టమైన సంవత్సరాలన్ని నీకు వెచ్చించాను." " నా వివాహా జీవితాన్ని నాశనం చేసావు." " నా యొక్క యవ్వనాన్ని నీవు దోచుకున్నావు." "నీవు నా పవిత్రతను పోగొట్టావు." "నీవు నాకు తగిన ఘనతను ఇవ్వలేదు" "నేను ప్రయత్నించటానికి కనీసం ఒక్క అవకాశం కూడా నీవు ఇవ్వలేదు." "నీవు నాకు మరొక అవకాశం ఇచ్చియుండాల్సింది." "నీవు నాకు తగినంత ఆప్యాయతను ఇవ్వలేదు.": వంటి వాక్యాలలో దేనిలో ఒకదాని రూపంగా మనుషులు తమ కోపాన్ని వ్యక్త పరుస్తారని మనకందరికి తెలుసు.
మనకి సంబంధించినదేదో మన దగ్గర నుండి తీసివేయబడిన కారణమే కోపానికి మూలమై యుండును. అది నీకు చెందవలసినది. ఇక అప్పటినుంచి అక్కడ అప్పు-అప్పు తీసుకున్న వ్యక్తికి మధ్య ఉండే సంబంధం ఏర్పడును.
మరి నీ సంగతేంటి? ఏ విధమైన రుణము మిమ్ములను కోపగించుకునేలా చేస్తుంది?
మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులను మీ జీవితాన్ని నియంత్రించడానికి మీరు ఇంకెంతకాలం అనుమతిస్తారు? మరొక నెల రోజులా? మరొక సంవత్సరకాలమా? నీ జీవితంలో మరికొన్ని సంవత్సరములా? ఇంకెంత కాలము?
ఈనాడే నిన్ను గాయపరచిన ఆ బాధను వదిలిపెట్టవలసిన రోజుగా ఉండాలి! అని నేను మీకు విన్నవించుకుంటున్నాను
జరిగిన దానిని తుడిచివేయలేము అన్నది వాస్తవమే, కాని నీ యొక్క భవిష్యత్తును నీ యొక్క గతము నియంత్రించకుండా నీవు చూసుకోవటం కూడా అంతే వాస్తవం. ఎఫెస్సి 4వ అధ్యాయములో, "సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి" అని ఆజ్ఞాపింపబడితిమి. "క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు"ట ద్వారా మనము దాన్ని చేయగలము.
కోపమునకు విరుగుడు క్షమాపణ. ఒకవేళ మనకి చేసిన తప్పులకు తిరిగి చెల్లించబడటానికి మనము వేచి ఉంటే, మనమే చెల్లించేవాళ్ళంగా మారెదము. మరొక ప్రక్కన, ఒకవేళ మనకి అచ్చియున్నవి మనము రద్దుపరచినట్లయితే, మనము స్వతంత్రులమగుదుము.
ఈ ఆధ్యాత్మిక సందేశములలో మనము చర్చించుకునే నాలుగు భీకరమైన శత్రువులలో, నా నమ్మిక ప్రకారం- అనుకోకుండా మరియు ఉద్దేశపూర్వకంగా కలిగిన బాధ నుండి వచ్చే కోపమే- ఇది అత్యంత వినాశనకరమైనది. అయినప్పటికి, కొన్ని విషయాలలో ఇదే సులువుగా అధిగమించ కలిగినది. ఆ రుణమును రద్దుపరచు కోవాలని నీ మనస్సులో నిశ్చయించుకోవట ద్వారా నీవు దానిని అధిగమించగలవు. ఆ నిర్ణయము తీసుకొని, "ఇక నీవు నాకేమి అచ్చియుండ లేదు" అని ప్రకటించుకోవటమే.
ఈ రోజే ఈ నాలుగు-దశల విధానాన్ని అనుసరించండి: (1) మొదటగా ఎవరిపట్ల నీవు కోపంగా ఉన్నావో గమనించు. (2) వారు నీకేమి అచ్చియున్నారో దానిని నిర్ధారించు. (3) వారిని క్షమించుట ద్వారా ఆ రుణమును రద్దుపరుచు. (4) మరలా ఆ కోపము రాకుండా చూసుకొనుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

ఏ విధముగానైతే శారీరకంగా బలహీనంగా ఉన్న హృదయము మన శరీరమును ఎలా నాశనము చేయగలదో, అదే విధంగా ఆత్మీయంగా మరియు భావోద్వేగాల పరంగా బలహీనంగా ఉన్న హృదయము కూడా మనలను, మన సంబంధ బాంధవ్యాలను నాశనము చేస్తుంది. తదుపరి ఐదు రోజులలో, ప్రతి హృదయమునకు సహజముగా ఉండే నాలుగు శత్రువులైన - అపరాధభావము, కోపము, దురాశ మరియు మత్సరము- వంటి వాటిని మన అంతరంగములో పరిశీలన చేసికొనుటకు ఆండీ స్టాన్లీ గారు మీకు సహాయపడుతూ, వాటిని ఎలా తొలగించుకొనవలెనో మీకు నేర్పించును.
More