ప్రణాళిక సమాచారం

నిజమైన దేవుడునమూనా

నిజమైన దేవుడు

DAY 4 OF 7

దేవుడు సర్వజ్ఞాని


మంచివాడిగానూ, సార్వభౌముడుగానూ, పవిత్రుడుగానూ ఉండడం మాత్రమే కాకుండా, నిజమైన ఈ దేవుడు సర్వజ్ఞానిగా కూడా ఉన్నాడు. ఈ దైవ గుణలక్షణం మీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొని వస్తుంది?


ఒకసారి నేను బైబిలు పాఠశాలలో ఉన్నప్పుడు నిజంగా ఒక కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నేను విధేయుడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, నా వివాహం, నా పని, నా అధ్యయనాలు మరియు నా భవిష్యత్తు విషయాలలో నాకు చాలా ప్రతికూల దృక్ఫథం ఉండేది.


అప్పుడు ఒక ప్రధానాధ్యాపకుడు ఇలా చెప్పడం చెప్పినట్లు విన్నాను, “సాధ్యమైనంత సుదీర్ఘ కాలం కోసం సాధ్యమైనంత అధికమైన ప్రజలకోసం సాధ్యమైనంత ఉత్తమమైన మార్గాల ద్వారా దేవుడు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను తీసుకొని వస్తాడని దేవుని జ్ఞానం మనకు చెపుతుంది.”


దేవుని జ్ఞానం నా పరిస్థితులను నిర్దేశిస్తుందని గ్రహించడానికి ఇది నాకు సహాయపడింది. నేను ప్రతిఘటించడం 


విడిచి పెట్టి నా విశ్వాసాన్ని పెంపొందింప చెయ్యడానికి ఆయనను అనుమతిస్తాను. 


మన జీవితంలోని ప్రతిదీ దేవుని జ్ఞానయుక్తమైన ప్రణాళికలో భాగం. ఇది ఆయన మంచి, సార్వభౌమ, ప్రేమ పూరిత స్వభావం మీద ఆధారపడి ఉంది.


సృష్టి, ఆయన వాక్యం, ఆయన కుమారుడు, ఆయన సమకూర్పు, ఆయన విమోచన ప్రణాళిక మరియు ఆయనతో మన స్వీయ అనుభవాల ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని మనకు వెల్లడిపరుస్తాడు. ఆయన జ్ఞానాన్ని విశ్వాసంతో అడగడం ద్వారా మనం పొందుకోగలమని కూడా ఆయన మనకు వాగ్దానం చేశాడు (యాకోబు 1:5-6).


ఈ సత్యం విషయంలో సరియైన అవగాహనను మనం గట్టిగా పట్టుకొన్నప్పుడు మన పరిస్థితులలో ఆయన జ్ఞానాన్ని చూడటం ప్రారంభించవచ్చు.


·  మన దృక్పథం విస్తృతంగా వృద్ధి చెందుతుంది, మన విశ్వాసం లోతుగా పెరుగుతుంది మరియు మన స్వభావం బలంగా పెరుగుతుంది.


·  మన ఒత్తిడిలు, భయాలు మరియు ఆందోళనలు వాడిపోవడం ప్రారంభిస్తాయి.


·  దేవుడు ప్రతిదానిని పరిపూర్ణ దృష్టితో చూస్తున్నాడనీ, మనలో ఆయన ఉద్దేశాలను నేరవేరుస్తున్నాడని మనం అర్థం చేసుకొంటాము. 


·  అది మన జీవితంలోని అన్ని రహస్యమైన సంగతులు తొలగకపోవచ్చు, అయితే దేవుని జ్ఞానయుక్త ప్రణాళికలలో మనం శాంతిని అనుభవిస్తాము.


ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.” (రోమా 11:33). 


ఈ రోజున నీ జీవితంలోని ప్రతీ అంశం నిజ దేవుని దైవిక జ్ఞానంలో వేరుపారి ఉందని గుర్తించండి. ఆయనను విశ్వసించడం ద్వారానూ, ఆయన జరిగిస్తున్నదానితో సహకరించడం ద్వారానూ నీ జీవితం మార్పు చెందుతుంది. 

Day 3Day 5

About this Plan

నిజమైన దేవుడు

నీవు దేవుణ్ణి ఎలా చూస్తావు? ఆ ప్రశ్నకు సమాధానం నిన్నూ, నీ విశ్వాసాన్నీ, స్వీయ-అవగాహనలనూ, వైఖరులనూ, సంబంధాలనూ, లక్ష్యాలనూ – నీ పూర్తి జీవితాన్నీ రూపొందిస్తుంది. దేవుని విషయంలో సరికాని దృక్పథం కలిగి ఉండటం మిమ్మల్ని జీవితకా...

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం సందర్శించండి: https://livingontheedge.org

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy