ఆఖరి పాఠములు: పవిత్ర వారపు పఠన ప్రణాళికనమూనా

The Final Lessons: A Holy Week Plan

10 యొక్క 4

నమ్మక ద్రోహం

నమ్మక ద్రోహం హృదయమును బ్రద్దలు చేస్తుంది.

నీవు ఎప్పుడైనా నమ్మక ద్రోహాన్ని అనుభవించావా? అది నిన్ను ఎలా ప్రభావితం చేసింది? లేక ఇప్పటికి అది నిన్ను ఎలా ప్రభావితం చేస్తుంది?

తన చివరి గడియలలో, యేసు రెండు వేర్వేరు నమ్మక ద్రోహములను ఎదుర్కొనెను.

యోహాను 13:21-30, 36-38 చదవండి.

ఈ రెండు సంఘటనలు ఏ విధమైన పోలికను కలిగియుండెను? ఏ విధమైన వ్యత్యాసమును కలిగియున్నవి?

యేసు పరిపూర్ణ మానవుడని మరియు ఆయన వాస్తవికమైన భావోద్వేగములు కలిగిన వాడని ఎరిగి, అవి తనను ఏ విధంగా ప్రభావితం చేసియుండ వచ్చునని నీవు తలంచెదవు?

యేసును అప్పగించుటకు యూదా 30 వెండి నాణెములకు అమ్ముడుపోయినట్టుగా మత్తయి 27:3 మనకు తెలియజేయును. 30 వెండి నాణెములకు ఆయనను పూర్తిగా వారికి అప్పగించెను. దానిని అతను మరలా ఇచ్చివేయుటకు సిద్ధపడినప్పటికి, కాని చాలా ఆలస్యమైంది, ఎందుకనగా అప్పటికే యేసును వారు అధికారులకు అప్పగించేసారు.

యేసును ఎవరో అమ్మివేసారనే దిగ్భ్రాంతిలో, సహజముగా యూదా మీద కోపము రావచ్చును.

మరి పేతురు సంగతేంటి? నీటి మీద నడిచినప్పుడు (మత్తయి 14:22-32ను చూడుము), మరియు తాను మునిగిపోతుండగా రక్షింపబడుట, అనేవేవి ప్రభువు పట్ల తన ప్రేమను మరియు భక్తిని కాపాడుటకొనుటకు సరిపోలేదా? అంతకు మునుపే తన పాదములను కడిగిన యేసును నిజంగా తిరస్కరించాడా?

అవును. మనము కూడా అటువంటి వారితో పాటే ఉన్నాము.

కాని మనందరికి ఒక గొప్ప శుభవార్త కలదు:

రోమా 8:38-39ను చదవండి.

దీనిని ఎంతమాత్రము చెదరగొట్టలేవు. నీవు ఏమి చేసినా ఆయనకు మనపై గల ప్రేమను నీవెంత మాత్రము చెరుపలేవు. అలాగే నీవు ఏమి చేసినా ఆయన నీలో చేసిన కార్యమును నీవు మార్చలేవు మరియు ఆయన నుండి నిన్ను ఏదియు యెడబాపనేరదు.

గత కొద్దికాలంగా పిల్లలను పెంచే విషయములో మేము చాలా క్లిష్ట సమయములను ఎదుర్కొన్నాము. ఇక మా వల్ల కాదు అనే పరిస్థితికి వచ్చి, పిల్లలను పెంచే విషయములో మమ్ములను దయలో నడిపించుమని దేవునికి మొర్ర పెట్టుకొంటున్నాము. కొద్ది వారముల నుండి నేనొక కార్యము చేయుట ఆరంభించాను, అదేంటంటే, ప్రతి దినము వారి లంచ్ బాక్స్లలో 2 చాక్లెట్లను పెట్టటం ప్రారంభించాను. సరైన సమయమునకు తనని స్కూల్ కు పంపుటలో ఇంటి నుండి బయటకు వచ్చే సమయములో విసుకులాటలు, చిరాకులు: లాంటివి మేము ఎదుర్కొన్నాము. కాని తను స్కూల్ లోనికి వెళ్ళే ముందర, నా పాప యొక్క చేతిని నేను పట్టుకొని, క్రిందకువంగి తన చెవిలో మెల్లని స్వరముతో, "ఈ లంచ్ బాక్స్ లోని రెండు చాక్లెట్లు నీకు ఏమని గుర్తు చేస్తున్నాయి?" అని అడిగే దాన్ని, తనకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ తల్లి హృదయాన్ని కరిగించి తిరిగి దయలోనికి నడిపించేలా ఒక చక్కటి చిరునవ్వు నా చిన్నారి నవ్వి, "నువ్వు, నాన్న నన్ను ప్రేమిస్తున్నారని, నేనేమి చేసినా అది మారదు" అని చెప్పింది.

ఏ విధమైన నిర్ణయాలు లేక ఎటువంటి నమ్మకద్రోహములను ఎదుర్కొన్నావో నాకైతే తెలియదు కాని, ఇది మాత్రం తెలుసు:

నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు నీవు ఏమి చేసినా అది ఎంతమాత్రము మారదు.

ఈ ప్రణాళిక గురించి

The Final Lessons: A Holy Week Plan

ఈ పవిత్ర వారములో మనల్ని మనం నిదానించుకొని ఈ భూమి మీద క్రీస్తు గడిపిన ఆఖరి దినములలో నుండి నేర్చుకుందాం. ఆయన సమయము చేసికొని మనకిచ్చిన పాఠములను లేక వరములను ప్రతి దినము మనము పొండుకుందాం. క్రీస్తునకు అత్యంత ఇష్టమైన దేమిటో -నీవు ఆయన ప్రజలను మరియు ఆయనను వెంబడించుటయే అని మరలా ఒకసారి తాజాగా మీకు గుర్తుచేయమంటారా? ఈ పవిత్ర వారములో ఇంకా ఆయన నీకు ఏమి బోధించనైయున్నారో నీకు తెలుసుకోవాలనుందా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు సేక్రేడ్ హాలిడేస్ తో ఉన్న బేకి కిసర్ కు మా కృజ్ఞతలు. మరింత సమాచారం కొరకు www.sacredholidays.com దర్శించండి