ప్రణాళిక సమాచారం

దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళికనమూనా

దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక

DAY 1 OF 5

పరిచయం


ఈ సంవత్సరం అంతా అస్పష్టంగానూ, ఒక చెడ్డ కలగానూ లేదా ఒక కాగితంమీద గజిబిజిగా రాసినట్టుగానూ అనిపించవచ్చు. గత పదకొండు నెలలు ఏవిధంగా కనిపించినప్పటికీ, మనకు తెలియకుండానే క్రిస్మస్ సమయం మనమీదకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మన వేడుకల ఆలోచనలు మార్పుచెందవచ్చు లేదా కనీసం, మహమ్మారి, రాజకీయ అశాంతి, పర్యావరణ మార్పులను నిరంతర ముప్పులు కలుగుతున్నాయి. ఇమ్మానుయేలు - మనతో ఉన్న దేవుడు మానవాళికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి. ఇంతకుముందు కంటే ఇది ఈ రోజు చాలా వాస్తవంగా ఉంది. దహించి వేస్తున్న అస్థిరత అంతటిలో ప్రభువైన క్రీస్తూ, సృష్టి పట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమా స్థిరంగా ఉన్నాయి. మన శ్రమలూ,  ఆందోళనలూ, ప్రశ్నల మధ్యలో కూడా ఆయన ఇప్పటికీ దేవుడిగానే ఉన్నాడు, శాశ్వతకాలం వరకూ ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు.


యెంత గొప్ప ఆశాభావం!


యెంత గొప్ప నిశ్చయత!!


యెంత గొప్ప ఆదరణ!!!


దౌర్భాగ్యకరంగా మనమందరమూ మన స్వంత జీవితాల్లో చిక్కుకున్నాము, నెమ్మదిగా ఉన్నప్పటికీ నిజంగానే మన సృష్టికర్తనుండి దూరం అవుతున్నాము. మనం రాజకీయాలనూ, సంస్కృతి, నైతిక క్షీణతలనూ, భయంకరమైన తెగుళ్ళనూ గురించి చర్చిస్తాము, అయితే ఇవేమీ మనలను మన మోకాళ్ళ వద్దకు తీసుకురావడం లేదు, దేవునికి సమీపంగా ఉండవలసినంతగా చెయ్యడం లేదు. కాబట్టి, ఈ ఆగమనం, మనతో ఉన్న దేవుని బట్టి ఆయన్ను స్తుతించడానికి మనం సమయం తీసుకొందాం, సామాజిక దూరం, ఒంటరితనం మధ్యలో చిక్కుకొన్న మనలను ఆయన ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు.


ఆయన ప్రణాలికలు మనకు హాని చేయవని మనం జ్ఞాపకం చేసుకొందాం, అవి మనకు ఒక ఆశాభావాన్నీ, మనం జీవిస్తున్న ఈ విచ్చిన్న లోకంలో సహితం ఆయన మనకు ఒక భవిష్యత్తును ఇస్తాయని గుర్తు చేసుకొందాం. ప్రార్థనలోనూ, ఆయన వాక్యధ్యానంలోనూ దేవునికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి.  ఈ లోకంలో మనం చెయ్యగలిగిన వాటిలో అవి పెద్దవి అయినా, చిన్నవి అయినా మన లోకంలో ఒక వెలుగుగా ఉండడం ద్వారా ప్రపంచ వెలుగు రాకను మనం వేడుకగా జరుపుకోవాలి.

వాక్యము

Day 2

About this Plan

దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక

మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంద...

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy