ప్రణాళిక సమాచారం

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం నమూనా

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

DAY 6 OF 7

కరువులో పొంగిపొరలె ప్రవాహం 


ఏడు సంవత్సరాల సమృద్ధి కాలం ముగిసిన తరువాత కరువు ఆరంభం అయ్యింది. ఐగుప్తు దేశం అంతా, దాని చుట్టూ ఉన్న దేశాలన్నీ సహాయం కోసం యోసేపు వద్దకు వచ్చాయి. యోసేపు సమర్ధవంతమైన ప్రణాళిక కోసం కృతజ్ఞతలు. ఐగుప్తు దేశానికి వచ్చే వారందరికీ ధాన్యాన్ని అమ్మగలడు. కనాను దేశంలో ఉన్న యాకోబూ, అతని కుమారులు కూడా కరువు ప్రభావాలను అనుభవిస్తున్నారు.


యాకోబు తన పదిమంది పెద్ద కుమారులను ధాన్యం సేకరించడానికి ఐగుప్తుకు పంపించాడు.


వారు యోసేపు వద్దకు వచ్చారు, అయితే వారు యోసేపు నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న సమయంలో వారు యోసేపును గుర్తించలేదు. అయితే యోసేపు వెంటనే వారిని గుర్తించాడు, గతంలో తన సోదరులందరూ తనకు వంగి నమస్కరిస్తారని చిన్న వయసులో తనకు కలిగిన కలలను జ్ఞాపకం చేసుకొన్నాడు. చివరకు యోసేపు సంఘటనలన్నిటినీ ఒక్క సారిగా జ్ఞాపకం చేసుకొన్నాడు. 


యోసేపు తన సోదరులను నాటకీయ, ఉత్కంఠతతో నిండిన బాధలకు గురిచేసిన తరువాత దానిని తనలో తాను ఉంచుకోలేకపోయాడు, తన సోదరులకు తనను తాను బయలుపరచుకొన్నాడు. 


తన సోదరులకు చూపించే క్షమాపణ, ప్రేమ కారణంగా పొంగి పొరలే అనుభవంలో నివసించడం అధికంగా కనిపిస్తుండడంలో యోసేపు ఒక గొప్ప ఉదాహరణ. అతని వస్త్రాన్ని తీసివేసి, ఖాళీగా ఉన్న అగాధంలో పడవేసి,  ముప్పై వెండి నాణాలకు ఇష్మాయేలీయులైన వర్తకులకు అమ్మి వేసి, అతని మరణాన్ని నకిలీదిగా చేసి తమ తండ్రిని నమ్మించిన సోదరులే ఇప్పుడు యోసేపు ముందు నిలబడి ఉన్నారు.   


యోసేపు వారిని శిక్షించగలడు, హింసించగలడు లేదా వారిని ఎగతాళి చేయగలడు, అయితే అతడు వారి హృదయాలను పరీక్షించాడు, వారి తండ్రి పట్ల వారి ప్రేమనూ, వారి తమ్ముడు బెన్యామీను పట్ల వారికున్న స్వాధీనతా సూచక శ్రద్ధనూ చూసినప్పుడు, వారందరిలో మార్పు వచ్చిందని యోసేపు తెలుసుకొన్నాడు. తక్షణమే యోసేపు వారిని క్షమించాడు. తన చర్యలలో వారి పట్ల తన ప్రేమను చూపించసాగాడు. అతడు వారిని కేవలం హత్తుకోవడమూ, వారి కుటుంబాల గురించి ఆరా తీయడమూ చేయలేదు. వారి బండ్లను ఐగుప్తులోని ఉత్తమమైన వాటితో నింపాడు, తన తండ్రినీ, వారి కుటుంబాలనూ తిరిగి తీసుకురావడానికి వారితో అదనపు బండ్లను పంపాడు. ఇది నమ్మశక్యంకానిదిగానూ, దైవిక ప్రవాహానికి సంకేతంగానూ ఉంది!


ఈ రోజు మీరు మీ ఆరోగ్యంలోనూ, మీ ఆర్ధిక పరిస్థితిలోనూ, మీ జీవన వృత్తిలోనూ, మీ వివాహంలోనూ లేదా మీ స్నేహాలలోనూ కరువును అనుభవించియుండవచ్చు. మీకు లేనివాటి మీద లక్ష్యం ఉంచడానికి బదులు మీకున్న దానితో ఇతరులను ఆశీర్వదించడానికి మీరు ఇంకా సిద్ధంగా ఉన్నారా?


మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టిన వారిని బేషరతుగా క్షమించి ముందుకు సాగడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? అలాంటి క్షమాపణ, ఔదార్యం మీ జీవితంలో పొంగిపొర్లుతున్న అనుభవానికి స్పష్టమైన సంకేతాలు. 

Day 5Day 7

About this Plan

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేల...

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy