రోమా 3:9 - Compare All Versions

రోమా 3:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము.

షేర్ చేయి
రోమా 3 TSA

రోమా 3:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.

షేర్ చేయి
రోమా 3 IRVTEL

రోమా 3:9 TERV (పవిత్ర బైబిల్)

మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను.

షేర్ చేయి
రోమా 3 TERV

రోమా 3:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

షేర్ చేయి
రోమా 3 TELUBSI