కీర్తనలు 31:1-8 - Compare All Versions

కీర్తనలు 31:1-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస హ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను. నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

షేర్ చేయి
కీర్తనలు 31 TELUBSI

కీర్తనలు 31:1-8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు. నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే. నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు. నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు. నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.

షేర్ చేయి
కీర్తనలు 31 IRVTEL

కీర్తనలు 31:1-8 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము. దేవా, నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము. దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం. యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను రక్షించుము. వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను. దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు. నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.

షేర్ చేయి
కీర్తనలు 31 TERV

కీర్తనలు 31:1-8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి. మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి. మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు. మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి. విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను. మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు. మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.

షేర్ చేయి
కీర్తనలు 31 TSA